Asianet News TeluguAsianet News Telugu

కరోనాపై ప్రధాని నరేంద్రమోడీ ఉన్నతస్థాయి సమీక్ష, వ్యాక్సినేషన్‌పై చర్చ

దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అలాగే వ్యాక్సినేషన్‌ కార్యక్రమం గురించి కూడా ఈ భేటీలో చర్చించనున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

pm narendra modi chairs high level meeting on covid 19 situation and vaccination
Author
New Delhi, First Published Sep 10, 2021, 7:29 PM IST

దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అలాగే వ్యాక్సినేషన్‌ కార్యక్రమం గురించి కూడా ఈ భేటీలో చర్చించనున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఇంకా కొవిడ్‌ సెకండ్ వేవ్ ముగియలేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ గురువారం వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ప్రధాని ఈ సమావేశం నిర్వహిస్తుండడం గమనార్హం.  

కాగా, దేశంలోని 35 జిల్లాల్లో ఇప్పటికీ వారపు కొవిడ్‌ పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగానే ఉందని రాజేశ్‌ భూషణ్‌ చెప్పారు. మరో 30 జిల్లాల్లో ఈ రేటు 5 నుంచి 10 శాతంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జోరుగా సాగుతోంది. వ్యాక్సిన్‌ అర్హత పొందిన వారిలో ఇప్పటికే సగం మందికి పైగా ఒక డోసు వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్రం తెలిపింది. మొత్తంగా 72 కోట్ల డోసులు వేసినట్లు  కేంద్రం ప్రకటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios