Asianet News TeluguAsianet News Telugu

‘‘ వాస్తవాన్ని ఎంచుకోండి , కలల్ని కాదు ’’ .. మోడీ వెనుక బ్యానర్‌లో ఆసక్తికర నినాదం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ ముగిసిన అనంతరం ఆదివారం నాలుగు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరిగింది. హిందీ బెల్ట్‌లో బీజేపీ ఏకపక్షంగా విజయం సాధించింది. రెండు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా బీజేపీ పుంజుకుంది.

PM Narendra Modi : A special message at the BJP head office ksp
Author
First Published Dec 3, 2023, 10:23 PM IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ ముగిసిన అనంతరం ఆదివారం నాలుగు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరిగింది. హిందీ బెల్ట్‌లో బీజేపీ ఏకపక్షంగా విజయం సాధించింది. రెండు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా బీజేపీ పుంజుకుంది. అయితే మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. దక్షిణాదిలో మాత్రం కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం కోసం పార్టీ కార్యాలయంలో వేదికను ఏర్పాటు చేశారు. నాలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ వేదికపై నినాదాలు రాశారు. అందులోని ఒక బ్యానర్‌పై ఇలా రాసి ఉంది - ‘‘ వాస్తవాన్ని ఎంచుకోండి, కలలు కాదు, అందుకే అందరూ మోడీని ఎన్నుకుంటున్నారు’’ .

 

PM Narendra Modi : A special message at the BJP head office ksp

 

అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. నేటి విజయం చారిత్రాత్మకమైనది,  అపూర్వమైనదని.. 'సబ్కా సాత్, సబ్కా వికాస్' ఆలోచన గెలిచిందని వ్యాఖ్యానించారు. నిజాయితీ, పారదర్శకత, సుపరిపాలన కారణంగానే ఈ విజయం దక్కిందన్నారు. బీజేపీపై ప్రేమ చూపినందుకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ప్రజలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే తెలంగాణలోనూ పార్టీకి మద్ధతు లభించిందని మోడీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కులాల వారీగా దేశాన్ని విభజించే ప్రయత్నాలు జరిగాయని.. నారీ శక్తి, యువ శక్తి, కిసాన్ ఔర్ గరీబ్ పరివార్‌ అనే నాలుగు కులాలే ముఖ్యమని తాను నమ్ముతానని ప్రధాని తెలిపారు. ఈ నాలుగు కులాల ప్రజలు బీజేపీ పట్ల ఉత్సాహాన్ని ప్రదర్శించారని, తాను గెలిచినట్లుగా ప్రతి పేదవాడు భావిస్తున్నారని మోడీ అన్నారు. 

ALso Read: బీజేపీని ఆ నాలుగు కులాలే గెలిపించాయి.. విజయోత్సవ సంబరాల్లో ప్రధాని మోడీ వ్యాఖ్యలు

మహిళలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ 100 శాతం నెరవేరుస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తీర్పు ఒక హెచ్చరిక లాంటిదని, దేశాన్ని బలహీనపరిచే రాజకీయాలు చేయొద్దని ప్రధాని హెచ్చరించారు. దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని , జీఎస్టీ వసూళ్లు రికార్డులు సృష్టిస్తున్నాయని ఆయన తెలిపారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం.. 2024 విజయానికి బాటలు వేసిందన్నారు.

ఏ ప్రభుత్వం కావాలనే విషయంలో దేశ ప్రజలు పరిపక్వతతో వున్నారని, అన్ని రకాలుగా ఆలోచించి ఓటేస్తున్నారని మోడీ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాల కార్యక్రమాలను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని .. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ మాకు గ్యారెంటీ వుందని ప్రధాని చెప్పారు. తెలంగాణ తమ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారని, ప్రతి ఎన్నికల్లోనూ బలపడుతున్నామని మోడీ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎప్పుడూ పనిచేస్తామని ప్రధాని తెలిపారు. 

 

PM Narendra Modi : A special message at the BJP head office ksp

కృతజ్ఞతా కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగిస్తూ భారత కూటమి ప్రజల్లో కులతత్వాన్ని చాటేందుకు కృషి చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల ప్రేమ, ఆశీర్వాదం, మద్దతుతో విపక్షాలు ప్రధాని మోదీకి వారు ఇచ్చిన దూషణలు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ , రాజస్థాన్‌లలో వికసించాయన్నారు. ఇండియా కూటమిని బుజ్జగించడం, కులతత్వం, ఓటు బ్యాంకు రాజకీయాలు దేశాన్ని విభజించే ప్రయత్నాలను మోడీ అభివృద్ధి అడ్డుకుంది. అభివృద్ధిని అగ్రగామిగా నిలిపి ఈ ఎన్నికల ఫలితాలను దేశం ఆమోదించిందని జేపీ నడ్డా ఎద్దేవా చేశారు.

 

PM Narendra Modi : A special message at the BJP head office ksp
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios