Asianet News TeluguAsianet News Telugu

అయోధ్య ఆలయ ప్రాణప్రతిష్ట రోజే... సరికొత్త పథకాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ

సూర్య వంశానికి చెందిన అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం రోజే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త పథకాన్ని ప్రకటించారు.  

PM Narenda Modi Announced pradhanmantri suryoday yojana scheme AKP
Author
First Published Jan 23, 2024, 7:25 AM IST

న్యూడిల్లీ : రామ జన్మభూమి అయోధ్యలో భవ్య రామమందిరాన్ని ప్రారంభించి గర్భగుడిలో కొలువైన బాలరాముడి ప్రాణప్రతిష్ట పూజలు నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలతో పాటు ఇతర రాంగాల ప్రముఖులు, సాదుసంతుల సమక్షంలో అయోధ్య ఆలయాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేవలం రామయ్య కొలువైన అయోధ్యలోనే కాదు దేశంలోని ప్రతి ఊరూ వాడలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇలా దేశ ప్రజలంతా అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో మునిగివుండగా ప్రధాని కీలక ప్రకటన చేసారు. 'ప్రధానమంత్రి సూర్యోదన యోజన' పేరిట సరికొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు మోదీ ప్రకటించారు.  

 సోలార్ విద్యుత్ వినియోగాన్ని దేశ ప్రజలకు మరింత చేరువచేసేందుకు తీసుకువచ్చిన పథకమే ఈ సూర్యోదయ యోజన.  గృహావసరాలకు సోలార్ పవర్ వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు... ఇలా దాదాపు కోటి ఇళ్లపై కొత్తగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటును ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  రాబోయే రోజుల్లో గృహావసరాలకు సాంప్రదాయ  విద్యుత్ వినియోగాన్ని తగ్గించి సోలార్ విద్యుత్ ఉపయోగించేలా ప్రేరేపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. 

 

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముగించుకుని దేశ రాజధాని న్యూడిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ సూర్యోదయ యోజన పథకంపై ప్రకటన చేసారు. ఇప్పటికే ఈ పథకం అమలుకు విధివిధానాలు రూపొందించగా ప్రకటనకు ముందు మరోసారి సంబంధిత అధికారులతో ప్రధాని చర్చించారు. అనంతరం స్వయంగా తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) మాధ్యమం ద్వారా కీలక ప్రకటన చేసారు. 

Also Read  మాస్టర్ ప్లాన్ .. రూ. 85 వేల కోట్లతో అయోధ్య అభివృద్ధి .. ఇకపైగా ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారనున్నదా?

''సూర్యవంశానికి చెందిన శ్రీరాముడి నుండి ప్రపంచంలోని భక్తులందరూ శక్తిని పొందుతుంటారు. అలాంటి బాలరాముడి ప్రాణప్రతిష్ట ఈరోజు అయోధ్యలో జరిగింది.  ఈ శుభ సమయంలో భారతీయుల ఇళ్లపై సోలార్ విద్యుత్ సిస్టమ్ వుండాలని సంకల్పించాను. దీంతో అయోధ్య నుండి డిల్లీకి చేరుకోగానే మొదటగా కోటి ఇళ్లపై సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుచేయాలనే నిర్ణయం తీసుకున్నాం.  ఇందుకోసం ప్రధానమంత్రి సూర్యోధయ యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ పథకం ద్వారా నిరుపేద, మధ్యతరగతి ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుంది... అలాగే ఇంధన రంగంలో దేశం ఆత్మనిర్భరత పొందుతుంది''  అంటూ ప్రధాని ట్వీట్ చేసారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios