COVID-19 Vaccine in India: దేశంలోని వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా లేఖ రాశారు. కరోనా వ్యతిరేక పోరాటం 16 జనవరి 2021 న ప్రారంభమైంది. వ్యాక్సిన్ డోసుల పంపిణీలో 200 కోట్ల మార్క్‌ను కేవలం 18 నెలల్లో వ్యవధిలోనే దాటడం భారత్ సాధించిన ఘన విజయమని ప్రధాని ప్రశసించారు.
Covid 19 Vaccination in India: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ చరిత్ర సృష్టించింది. జూలై 17 నాటికి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ 200 కోట్ల మార్క్‌ను దాటింది. భారత్ ఈ ఘనతను కేవలం 18 నెలల్లోనే సాధించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు ప్రత్యేకంగా లేఖ రాశారు. ఈ ఘనత సాధించినందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని మోదీ లేఖలో ఏమన్నారంటే..?
మీ క్రియాశీల భాగస్వామ్యంతో భారతదేశం మరోసారి చరిత్ర సృష్టించింది. కరోనా పై పోరాటంలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ 16 జనవరి 2021న ప్రారంభమైంది. ఈ పోరాటంలో 17 జూలై 2022న ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నాము. ఇది దేశానికి చిరస్మరణీయమైన రోజు. ఎందుకంటే.. 200 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను అందించి లక్ష్యాన్ని సాధించాము. ఈ ప్రపంచ మహమ్మారి సమయంలో టీకా ప్రచారంలో పాల్గొన్న ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు సహా ఫ్రంట్‌లైన్ కార్మికులు చేసిన సేవలను ప్రశంసించారు.
శతాబ్దపు అతిపెద్ద ప్రపంచ మహమ్మారి సమయంలో ప్రాణాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. మన వ్యాక్సినేటర్లు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఆరోగ్య సంరక్షణ సహాయక సిబ్బంది, ఫ్రంట్‌లైన్ కార్మికులు మన దేశ ప్రజల భద్రతలో కీలక పాత్ర పోషించారు. సంక్షోభ సమయాల్లో వారి కర్తవ్య భక్తి ప్రశంసనీయం. COVID-19కి వ్యతిరేకంగా మా పోరాటంలో ఇది అద్భుతమైన విజయం" అని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లిన తీరు అమోఘం. వ్యాక్సినేషన్ కార్యక్రమంగా ఇంత వేగంగా, పెద్ద ఎత్తున సాగడానికి కారణమైన వారిని, కరోనాపై పోరాటంలో భారత్ పాత్రను కీర్తిస్తూనే ఉంటాయని అని ప్రధాని పేర్కొన్నారు. కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా జపాన్ వంటి ఆసియా దేశాలు కేసుల పెరుగుదలను చూసాయి. ఈ తరుణంలో ఫ్రాన్స్ కరోనా బారిన పడి అగ్రస్థానంలో నిలించింది. ఇదిలా ఉంటే.. భారత్‌లో 200 కోట్ల డోస్‌లను పూర్తి చేయడం పెద్ద విజయం. అని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ.. ‘భారత్ మళ్లీ చరిత్ర సృష్టిస్తుంది! 200 కోట్ల వ్యాక్సిన్ మోతాదుల ప్రత్యేక మార్కును దాటినందుకు భారతీయులందరికీ అభినందనలు. భారతదేశం యొక్క టీకా ప్రచారాన్ని స్కేల్, స్పీడ్‌లో అసమానమైనదిగా చేయడంలో సహకరించిన వారికి గర్వకారణం. ఇది COVID-19కి వ్యతిరేకంగా ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేసింది."అని పేర్కొన్నారు.
ప్రధాని మోదీకి బిల్ గేట్స్ శుభాకాంక్షలు
కరోనాపై భారత్ సాధించిన ఈ ఘనత ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. భారతదేశంలో 200 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీని పూర్తి చేసినందుకు భారత ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీకి బిల్ గేట్స్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు భారత వ్యాక్సిన్ తయారీదారులు, భారత ప్రభుత్వంతో మా నిరంతర భాగస్వామ్యం కోసం మేము కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు.
