ప్రధాని మోదీ  నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్ ఈ రోజు ప్రసారం అయింది. అయితే ఈ సందర్బంగా ప్రధాని మోదీ మన్ కీ బాత్ 100 ఎపిసోడ్‌ను ట్యూన్ చేసిన భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రధాని మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం నేటితో 100 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఈ రోజు ప్రసారం అయింది. అయితే ఈ సందర్బంగా ప్రధాని మోదీ మన్ కీ బాత్ 100 ఎపిసోడ్‌ను ట్యూన్ చేసిన భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌‌ల పోస్టు చేశారు. అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమం విన్నవారందరూ ఆ ప్రత్యేక్ష క్షణాలను పంచుకోవాలని ప్రధాని మోదీ కోరారు. నమో (NaMo) యాప్ ద్వారా గానీ, https://mkb100.narendramodi.in లింక్ ద్వారా కానీ మన్ కీ బాత్ కార్యక్రమం విన్న ప్రత్యేక్ష క్షణాలను పంచుకోవాలని పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే, మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఈ ప్రసారం కోట్లాది మంది భారతీయుల భావాలను వ్యక్తీకరిస్తుందని.. ఇది తాను ప్రజలకు ఎప్పుడూ దూరంగా ఉండననే విషయాన్ని నిర్దారిస్తుందని చెప్పారు. ‘‘మన్ కీ బాత్’’ తనకు ప్రజలతో మమేకం కావడానికి ఒక పరిష్కారాన్ని ఇచ్చిందని.. ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని తనకు ఆధ్యాత్మిక యాత్ర అని మోదీ అన్నారు. ఈ కార్య‌క్ర‌మం కోట్లాది మంది భార‌తీయుల ‘‘మ‌న్ కీ బాత్‌’’కి ప్రతిబింబం అని.. వారి భావాల వ్యక్తీకరణ అని చెప్పారు. 

Scroll to load tweet…


‘‘స్వచ్ఛ్‌ భారత్‌’’ అయినా, ‘‘ఖాదీ’’ అయినా, ‘‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’’ అయినా.. మన్‌ కీ బాత్‌లో లేవనెత్తిన అంశాలు ప్రజా ఉద్యమాలుగా మారాయని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఈ కార్యక్రమం తాను ప్రజల నుంచి ఎప్పటికీ విడిపోనని నిర్ధారిస్తుందని చెప్పారు. ఇక, 100వ ఎపిసోడ్ సమయంలో.. గత ఎపిసోడ్‌లో ప్రస్తావించినవారిలో కొంతమంది వ్యక్తులతో మోడీ టెలిఫోనిక్ సంభాషణ కూడా చేశారు. 

ఇక, ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమానికి ఎంత విశేష ఆదరణ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను దేశ ప్రజలతో పంచుకుంటున్నారు. అలాగే పర్యావరణం, పరిశుభ్రత, వివిధ సామాజిక సమస్యలు మొదలైన అనేక అంశాలను ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే ప్రతిష్టాత్మక మన్ కీ బాత్ కార్యక్రమం నేటితో 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంది.