Asianet News TeluguAsianet News Telugu

సీబీఐ వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ

New Delhi: ఏప్రిల్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో సీబీఐ వజ్రోత్సవ వేడుకలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అలాగే, షిల్లాంగ్, పూణే, నాగ్‌పూర్‌లలో కొత్తగా నిర్మించిన సీబీఐ కార్యాలయ సముదాయాలను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.
 

PM Modi to inaugurate CBI's diamond jubilee celebrations at Vigyan Bhawan in Delhi on April 3
Author
First Published Apr 2, 2023, 12:10 PM IST

CBI's diamond jubilee celebrations: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వజ్రోత్సవ వేడుక‌ల‌ను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం (ఏప్రిల్ 3) ఢిల్లీలో ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విజ్ఞాన్ భవన్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది. ఈ కార్యక్రమంలో విశిష్ట సేవల‌కు సంబంధించి రాష్ట్రపతి పోలీస్ మెడల్, సీబీఐ ఉత్తమ దర్యాప్తు అధికారులకు గోల్డ్ మెడల్ గ్రహీతలకు సన్మాన కార్యక్రమం జరుగుతుందని, ఇందులో ఆయన గ్రహీతలకు పతకాలు అందజేస్తారని పీఎంవో పేర్కొంది.

3 నగరాల్లో సీబీఐ కార్యాలయ సముదాయాలను ప్రారంభించనున్న ప్రధాని

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఏప్రిల్ 3న మూడు నగరాల్లో  సీబీఐ కార్యాలయ సముదాయాలను ప్రారంభించనున్నారు. షిల్లాంగ్, పూణే,  నాగ్ పూర్ లలో నూతనంగా నిర్మించిన సీబీఐ కార్యాలయ సముదాయాలను ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం సీబీఐ డైమండ్ జూబ్లీ వేడుకల సంవత్సరానికి గుర్తుగా పోస్టల్ స్టాంప్, స్మారక నాణెం విడుదల చేయనున్నారు. అంతేకాకుండా, ప్రధాని మోడీ ఏజెన్సీ ట్విట్టర్ హ్యాండిల్ ను కూడా ప్రారంభిస్తారు.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గురించి..
 
1963 ఏప్రిల్ 1న భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ చేసిన తీర్మానం ద్వారా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)  ఏర్పాటైంది. మొదట లంచం, ప్రభుత్వ అవినీతిని దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేయబడింది, అయితే, 1965 లో ఇది భారత ప్రభుత్వం అమలు చేసే కేంద్ర చట్టాల ఉల్లంఘనలు, బహుళ-రాష్ట్ర వ్యవస్థీకృత నేరాలు, బహుళ-ఏజెన్సీ లేదా అంతర్జాతీయ కేసులను దర్యాప్తు చేయడానికి విస్తృత అధికార పరిధిని పొందింది. సీబీఐ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం సమీపంలోని సీజీఓ కాంప్లెక్స్ లో ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios