Asianet News TeluguAsianet News Telugu

G20 Summit 2023: నేడే అమెరికా అధ్యక్షుడు రాక.. ప్రధాని మోడీ, జో బైడెన్ ల ప్రత్యేక భేటీ..  

G20 Summit 2023: భారత్‌లో జరగనున్న జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ నేడు ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో జో బిడెన్,  ప్రధాని మోడీ మధ్య ప్రత్యేక భేటీ జరుగనున్నది. ఈ భేటీ భారత్ - అమెరికా మధ్య పలు  ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. 

 

PM Modi to hold talks with US President Joe Biden today KRJ
Author
First Published Sep 8, 2023, 5:51 AM IST

G20 Summit 2023: దేశ రాజధాని ఢిల్లీ G20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సమ్మిట్‌లో పాల్గొనే అతిథుల రాక కూడా ప్రారంభమైంది. ఇప్పటికే మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జుగ్నాథ్, నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో సహా పలువురు అతిథులు ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 8) అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా ఢిల్లీ చేరుకోనున్నారు.

అయితే.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కేవలం G-20 సమ్మిట్ లో హాజరుకావడానికే భారత్ కు రావడంలేదు. ఈ పర్యటనలో భాగంగా భారత్ - అమెరికా మధ్య పలు అంశాలపై ద్వైపాక్షిక సమావేశం జరుగనున్నది.  ఈ మేరకు ప్రధాని మోడీతో అమెరికా అధ్యక్షుడు ప్రత్యేకంగా భేటీ కానున్నట్టు తెలుస్తోంది. కాగా.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ ఆయనకు స్వాగతం పలుకుతారు. అమెరికా అధ్యక్షుడిగా ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. 2020 ఫిబ్రవరిలో వచ్చిన డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను సందర్శించిన చివరి అమెరికా అధ్యక్షుడు.

ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం 

అమెరికా అధ్యక్షుడు శుక్రవారం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగే జి-20 నేతల సదస్సులో జో బిడెన్ పాల్గొంటారని వైట్‌హౌస్ తెలిపింది. జో బిడెన్  ఆదివారం (సెప్టెంబర్ 10) మహాత్మా గాంధీ సమాధి అయిన రాజ్ ఘాట్‌ను సందర్శించనున్నారు. అనంతరం ఆయన వియత్నాం బయలుదేరనున్నారు.

ఈ సమస్యలపై చర్చ

ద్వైపాక్షిక సమావేశంలో వాతావరణ మార్పు, ఆర్థిక సహకారం, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకు సంస్కరణల ఎజెండాపై ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు జో బిడెన్‌లు చర్చిస్తారని అమెరికా అధికారులు తెలిపారు. చర్చల్లో ప్రముఖంగా కనిపించే మరో అంశం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.

వార్తా సంస్థ PTI ప్రకారం.. క్లీన్ ఎనర్జీ, డిఫెన్స్, హై-టెక్నాలజీతో సహా వివిధ కీలక రంగాలలో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించడంపై ప్రధాని మోదీ - ప్రెసిడెంట్ బిడెన్ మధ్య చర్చ సాగవచ్చని తెలుస్తోంది. అలాగే..  డ్రోన్ డీల్, జెట్ ఇంజన్ డీల్ పై చర్చించే అవకాశం ఉంది. చిన్న మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్లపై సాధ్యమయ్యే అణు ఒప్పందం, డ్రోన్ ఒప్పందం, జెట్ ఇంజిన్‌లపై రక్షణ ఒప్పందానికి యుఎస్ కాంగ్రెస్ ఆమోదం పురోగతి, ఉక్రెయిన్‌కు ఉమ్మడి సహాయం, వీసాల సమస్య లపై చర్చించనుట్లు తెలుస్తోంది. 

ఇకపోతే.. జి-20 సదస్సులో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. అంతర్జాతీయ చట్టం సూత్రాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలు, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి సంబంధించి న్యాయమైన, మన్నికైన శాంతిని నెలకొల్పేందుకు జి-20 సదస్సులో అధ్యక్షుడు బిడెన్ పిలుపునిస్తారని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ తెలిపారు. ఈ సూత్రాలకు కట్టుబడి ఉక్రెయిన్‌కు అవసరమైనంత కాలం అమెరికా మద్దతు కొనసాగిస్తుందని అధ్యక్షుడు నొక్కి చెబుతూనే ఉన్నారు.

తదుపరి G-20 అధ్యక్ష బాధ్యతలెవరికీ..? 

G-20 గ్రూప్‌లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ (EU) ఉన్నాయి. గతేడాది డిసెంబర్‌లో భారత్‌కు జి-20 అధ్యక్ష పదవి లభించింది. ఇప్పుడు ప్రధాని మోదీ G-20 అధ్యక్ష పదవిని సెప్టెంబర్ 10న బ్రెజిల్ అధ్యక్షుడికి అప్పగించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios