ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 13న సీఎంలతో భేటీ కానున్నారు. కరోనా పరిస్థితులపై సీఎంలతో మోడీ చర్చించనున్నారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి Narendra Modi ఈ నెల 13న రాష్ట్రాల సీఎంలతో భేూటీ కానున్నారు. దేశంలో Corona కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై Chief Ministersతో ప్రధాని చర్చించనున్నారు. దేశంలో కరోనా Omicron కేసులు ఐదు వేలకు చేరువలో ఉన్నాయి.
ఈ నెల 9వ తేదీనే ప్రధాని నరేంద్ర మోడీ కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్నినిర్వహించారు.కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, ఆరోగ్యశాఖ మంత్రి మాండవీయ తో పాటు పలువురు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో కల్పించాల్సిన ఆరోగ్య సదుపాయాలపై చర్యలు తీసుకోవాలని మోడీ అధికారులకు సూచించారు. అధిక కేసులు నమోదౌతున్న క్లస్టర్లలో ఇంటెన్సివ్ కంటైన్‌మెంట్ తో పాటు నిఘాను ఏర్పాటు చేయాలని ప్రధాని కోరారు. అధికంగా కరోనా కేసులు నమోదౌతున్న రాష్ట్రాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని కూడా ప్రధాని అధికారులను ఆదేశించారు.
India లో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,68,063 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి భారత్‌తో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,58,75,790కి చేరింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. అయితే తాజాగా నమోదైన కేసులు కిందటి రోజు నమోదైన కేసుల సంఖ్య కంటే 6.5 శాతం తక్కువగా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కరోనాతో 277 మంది మృతిచెందారు.
దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,84,213కి చేరింది. తాజాగా కరోనా నుంచి 69,959 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,45,70,131కి చేరింది. ప్రస్తుతం దేశంలో 8,21,446 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రోజువారి పాటిజివిటీ రేటు 10.64 శాతంగా ఉంది.
కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 33,470, పశ్చిమ బెంగాల్‌లో 19,286, ఢిల్లీలో 19,166, తమిళనాడులో 13,990, కర్ణాటకలో 11,698 కేసులు నమోదయ్యాయి. ఇక, దేశంలో నిన్న 15,79,928 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా Icmr తెలిపింది. ఇప్పటివరకు భారత్‌లో మొత్తంగా 69,31,55,280 శాంపిల్స్‌కు పరీక్షించినట్టుగా పేర్కొంది.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. దేశంలో నిన్న 92,07,700 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,52,89,70,294కు చేరింది. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 4,461 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ లు కూడా కరోనా బారినపడ్డారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కరోనా నుండి కోలుకొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలకు కేంద్రం పలు మార్గదర్శకాలను వెల్లడించింది. కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు తీసకోవాల్సిన చర్యలపై కేంద్రం రాష్ట్రాలకు ముందు జాగ్రత్తలను తెలిపింది.
