కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, సోషల్ డిస్టెన్సిన్గ్ అవసరాన్ని ప్రజలకు తెలియజేయడానికి నిన్న జనతా కర్ఫ్యూ పాటించమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇలా నరేంద్ర మోడీ  పిలుపును ఎందుకు అందరూ ఎందుకు పాటించాలో... సాయంత్రం 5 గంటలకు చప్పట్లను ఎందుకు కొట్టమన్నారో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. 

ఏదైతేనేమి... దేశమంతా జనతా కర్ఫ్యూ గ్రాండ్ సక్సెస్. సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా బయటకు వచ్చి ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారందరికీ థాంక్స్ చెబుతున్నట్టుగా దేశమంతా సంఘీభావంగా తమ మద్దతును తెలిపారు కూడా. 

ఇలా మోడీ జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చిననాడు అంత సంయమనంతో ఆదేశాలన్నిటిని పాటించిన జనం, ఆ తెల్లారి అంటే... నిన్న సోమవారం మాత్రం ఆ ఆదేశాలను బేఖాతరు చేసారు. చాలా చోట్ల లాక్ డౌన్ ఉన్నప్పటికీ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. 

దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ నిన్ననే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే! ఇక నేటి ఉదయం నుండి మోడీ వివిధ వర్గాల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. మీడియా ప్రతినిధుల నుండి మొదలుకొని ఆర్థికరంగ నిపుణుల వరకు అందరితో చర్చలు జరిపారు. 

తాజాగా భారత ఇండస్ట్రియలిస్టులతో... పారిశ్రామిక రంగ ప్రతినిధులతో, అసోచామ్, ఫిక్కీ మొదలగు ఇండస్ట్రియల్ లాబీ గ్రూపులతో మోడీ సమావేశమయ్యారు. ఆ అన్ని సమావేశాలు ముగిసిన తరువాత మోడీ భారత ప్రజలనుద్దేశించి నేటి రాత్రి 8 గంటలకు ప్రసంగించబోతున్నట్టు తెలిపారు. 

also read:ఈశాన్య రాష్ట్రాలకు పాకిన కరోనా: మణిపూర్ లో తొలి పాజిటివ్ కేసు

మోడీ ఇలా మాట్లాడుతాను అని చెప్పడంతో అందరూ కూడా మోడీ ఏం మాట్లాడబోతున్నారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరికీ వారు ఊహాగానాల్లో మాత్రం మునిగిపోతున్నారు. కాకపోతే మోడీ ప్రస్తుతానికి మాత్రం ప్రజలందరినీ కరోనా ను ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ కి సహకరించాలని కోరనున్నట్టు తెలియవస్తుంది. 

ఇప్పటికే రాష్ట్రప్రభుత్వాలకన్నిటికి లాక్ డౌన్ పాటించాలని ఆదేశించినా ప్రజలు పాటించకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేసారు. కరోనా పై మోడీ నేడు రెండవ ప్రసంగాన్ని చేయబోతున్న నేపథ్యంలో దేశమంతా ఆసక్తిగా గమనిస్తుంది. తొలి ప్రసంగాన్ని జనతా కర్ఫ్యూ కి ముందు చేసిన విషయం తెలిసిందే!