న్యూఢిల్లీ: దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు కూడ కరోనా వైరస్ పాకింది. యూకేలో పర్యటించి వచ్చిన  23 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా రిపోర్టులు తేల్చాయి. ఈ మేరకు మంగళవారం నాడు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Also read:కరోనా ఎఫెక్ట్: రేపటి నుండి డొమెస్టిక్ విమానాలు రద్దు

యూకే నుండి స్వంత ప్రాంతానికి తిరిగి వచ్చిన మహిళను ఇంఫాల్ లోని జవహర్‌లాల్ నెహ్రు మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ యువతికి ఈ ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు.

ఈ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్టుగా మణిపూర్ రాష్ట్రం ఈ నెల 23వ తేదీన ప్రకటించింది. అత్యవసర సరుకులకు లాక్‌డౌన్ నుండి మినహాయింపు ఇచ్చారు. 

రీజినల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, జెఎన్ఐఎంఎస్ లలో ఐసోలేషన్ వార్డులను ఆయా రాష్ట్రాలు ఏర్పాటు చేశాయి. విదేశాల నుండి వచ్చినవారిని 14 రోజుల పాటు ఇంటికే పరిమితం కావాలని అధికారులు ఆదేశించారు.