ప్రధాని మోడీ ఈ రోజు నూతన పార్లమెంటు భవన నిర్మాణ ప్రాంతానికి వెళ్లారు. నూతన పార్లమెంటు భవనం సెంట్రల్ ఫొయర్ పై భాగంలో జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించి అక్కడ కార్మికులతో మాట్లాడారు. ఇది మీ ఇల్లుగా భావించాలని అన్నారు. 

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు నూతన పార్లమెంటు భవన నిర్మాణ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కొత్త పార్లమెంటు భవనం సెంట్రల్ ఫోయర్ పై భాగంలో జాతీయ చిహ్నాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన నూతన పార్లమెంటు భవన నిర్మాణ కార్మికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

సాధారణ ఇల్లు నిర్మిస్తామని భావిస్తున్నారా? లేక గొప్ప కార్యంలో భాగస్వాములు అయ్యారని భావిస్తున్నారా? అని ప్రధాని మోడీ ఆ కార్మికులను అడిగారు. వారంతా తాము ఒక గొప్ప కార్యంలో భాగంగా పని చేస్తున్నట్టు తెలిపారు. చరిత్ర నిర్మాణంలో భాగంగా ఉంటున్నామనే అనుభూతి తమలో ఉన్నదని చెప్పారు. అనంతరం, ఓ వర్కర్ మరికొంత ఉత్సాహంతో ప్రధాని మోడీతో మాట్లాడారు. 

Scroll to load tweet…

ప్రధాని మోడీని రాముడితో పోల్చాడు. ఇక్కడి రావడాన్ని ఆయన శబరి నివాసానికి వచ్చినట్టుగా భావిస్తున్నట్టు తెలిపాడు. దీంతో వెంటనే ప్రధాని మోడీ అందుకుని.. వాహ్.. వాహ్.. ఇది మీ ఇల్లు అంటూ మాట కలిపారు. దేశంలోని ప్రతి పౌరుడు ఇది వారి ఇల్లుగా భావించాలని వివరించారు. మీరు గొప్ప విషయం చెప్పారని ప్రశంసించారు.