దేశంలో త్వరలో 6జీ యుగం రాబోతుందన్న ప్రధాని మోదీ.. 5జీ కంటే ఇది ఎంత మెరుగ్గా ఉంటుంది..

భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. దేశం త్వరలో 6జీ యుగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోందని అన్నారు.

PM Modi talks of 6G in Independence Day speech How 6G is different ksm

భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. దేశం త్వరలో 6జీ యుగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోందని అన్నారు. భారతదేశం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడంతో పాటు.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యంత సరసమైన మొబైల్ డేటా ప్లాన్‌లు, ఇంటర్నెట్ సేవలను అందజేస్తోందని చెప్పారు. భారత్ 6జీ సాంకేతికత వైపు అడుగులు వేస్తుందని.. ఇందుకు సంబంధించిన టాస్క్‌ఫోర్స్ ఇప్పటికే అమలులో ఉందని తెలిపారు.

‘‘భారతదేశం 5జీ నుంచి 6జీ కి త్వరగా మారడానికి కృషి చేస్తోందని అన్నారు. మేము 6జీ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసాము. 5జీ అత్యంత వేగంగా దేశవ్యాప్తంగా రోల్‌అవుట్‌ను సాధించింది’’ అని ప్రధాని మోదీ అన్నారు. ఈ క్రమంలోనే దేశంలో మరోసారి 6జీ గురించి చర్చ మొదలైంది. ఇప్పటికే భారతదేశంలో పలు ప్రాంతాల్లో 5జీ ప్రారంభించబడినందున.. కేంద్ర ప్రభుత్వం నెమ్మదిగా ఇంకా స్థిరంగా 6జీ పరిచయం చేయడంపై దృష్టి సారించినట్టుగా కనిపిస్తోంది. అసలు 5జీ కంటే 6జీ ఎంత మెరుగ్గా ఉంటుందో తెలసుకుందాం..

6జీ పేరు సూచించినట్లుగా.. ఆరవ తరం సెల్యులార్ టెక్నాలజీ. ఇది మైక్రోసెకండ్ వేగంతో విభిన్న కనెక్టివిటీని అందజేస్తుందని చెబుతున్నారు. ఇది 5జీ తర్వాత తదుపరి దశ. 6జీ అమల్లోకి వస్తే.. ఇప్పటికే సూపర్ ఫాస్ట్ 5జీ కంటే ఇంటర్నెట్ 100 రెట్లు వేగంగా మారుతుందని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ చెబుతుంది. 5జీ సెకనుకు 10 గిగాబైట్స్ వరకు వేగాన్ని అందుకోగలిగితే, 6జీ సెకనుకు 1 టెరాబైట్ చేరుకోగలదు.

5జీ కంటే 6జీ చాలా శక్తివంతమైన, వేగవంతమైన వేగంతో ఉండబోతోంది. కేవలం ఒక నిమిషంలో 100 సినిమాల వంటి భారీ మొత్తంలో డేటాను డౌన్‌లోడ్ చేయగలగదని నిపుణులు చెబుతున్నారు. అదనంగా 6జీ డిజిటల్ ప్రపంచానికి దగ్గరగా తీసుకువస్తుంది. అయితే 6జీ నెట్‌వర్క్ ఇంకా ఉనికిలో లేదు. అయితే 6జీ టెక్నాలజీతో వినియోగదారులు తక్షణమే డేటాను బదిలీ చేయగలరని.. బఫరింగ్, లాగ్స్, డిస్‌కనెక్ట్‌లను తొలగించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే వర్చువల్ రియాలిటీ మరింత వాస్తవమైనదిగా అనిపించనుంది. 

6జీ ప్రత్యేకంగా ఉండబోతోంది.. ఎందుకంటే ఇది భూమిపై, ఆకాశంలో పని చేయగలదు. నేలపై ప్రయాణంలో ఉన్న, విమానంలో ప్రయాణిస్తున్న ఫోన్ ద్వారా వేర్వేరు సాంకేతికతలను ఉపయోగించుకునే  వీలు కల్పిస్తుందని అంటున్నారు. ఇది లెక్కలేనన్ని యంత్రాలు, గాడ్జెట్‌లను ఒకదానితో ఒకటి లింక్ చేస్తుంది. 6జీ రాక  భౌతిక వాస్తవికత, డిజిటల్ రంగానికి మధ్య ఉన్న పంక్తులను అస్పష్టం చేస్తుందని.. మనం జీవించే విధానం, సాంకేతికతతో పరస్పర చర్య చేసే విధానంలో నిజంగా విప్లవాత్మక మార్పులు చేస్తుందని నిపుణులు  భావిస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios