ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తన సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో (Modi in Varanasi) పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ వారణాసి కాశీలోని లలితా ఘాట్‌కు (Lalita Ghat)కు చేరుకుని గంగా నదిలో పుణ్య స్నానం ఆచరించారు.

ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తన సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో (Modi in Varanasi) పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ వారణాసి కాశీలోని లలితా ఘాట్‌కు (Lalita Ghat)కు చేరుకుని గంగా నదిలో పుణ్య స్నానం ఆచరించారు. కాషాయ వస్త్రాలు ధరించిన మోదీ.. గంగా నదిలో కలశంతో పుష్పాలు వదిలారు. గంగానదిలో పుణ్య స్నానం ఆచరించారు. మరికాసేటప్లో ప్రధాని మోదీ శ్రీ కాశీ విశ్వ‌నాథ్ ధామ్‌ను సంద‌ర్శించ‌నున్నారు. అక్కడ రూ.339 కోట్ల వ్య‌యంతో పూర్తిచేసిన కాశీ విశ్వ‌నాథ్ ధామ్ మొద‌టి ద‌శ‌ను ప్రారంభించ‌నున్నారు.

అంతకుమందుకు ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి వారణాసి చేరుకున్న ప్రధాని మోదీకి.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ స్వాగతం పలికారు. ప్రజలు కూడా పూల వర్షం కురిపిస్తూ మోదీకి ఘన స్వాగతం చెప్పారు. మోదీ మోదీ, హర్​ హర్​ మహాదేవ్​ అంటూ నినాదాలు చేశారు. తొలుత ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత గంగానదిలో డబుల్‌ డెక్కర్‌ షిప్‌పై ప్రయాణించారు. తర్వాత ఉత్తరప్రదేశ్‌ CM యోగి ఆదిత్యానాథ్ దాస్‌తో కలిసి మోదీ.. డబుల్ డెక్కర్ బోట్‌లో ఖిర్కియా ఘాట్ నుండి లలితా ఘాట్ వరకు ప్రయాణించారు. అనంతం గంగానదిలో పుణ్య స్నానం ఆచరించారు. కాశీ విశ్వనాథ ఆలయంలో కూడా ప్రధాని మోదీ.. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 

Scroll to load tweet…

కాసేపట్లో కాశీ విశ్వనాథ్ ధామ్ మొదటి దశను ప్రారంభించనున్న మోదీ.. 
కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ను (Kashi Vishwanath Corridor project) ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాసేపట్లో ప్రారంభించనున్నారు. గంగానదిపై ఉన్న రెండు ఘాట్ లతో పురాతన కాశీ విశ్వనాథ ఆలయాన్ని (Kashi Vishwanath Temple) ఈ కారిడర్ కలపనుంది. కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌కు ప్రధాని మోదీ 2019 మార్చి 8న శంకుస్థాపన చేశారు. ఈ కారిడార్ నిర్మాణంలో భాగంగా 40 పురాతన ఆలయాలను పునరుద్ధరించి, సుందరీకరించారు. దాదాపు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ప్రాజెక్టులో 23 భవనాలను మోదీ ప్రారంభించ‌నున్నారు. ఈ కార్యక్రమంలోనే బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గోనున్నారు. కాగా, మోదీ రెండు రోజుల పాటు వారణాసిలో పర్యటించనున్నారు.