రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయం, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అన్నారు.
దేశంలోని సామాన్య ప్రజల కలలు నెరవేరుతున్నాయని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పలువురు సీనియర్ బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇది గుజరాత్‌లో మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం . దీనిని దాదాపు 1,405 కోట్ల రూపాయలతో నిర్మించారు.
ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:-
ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భూపేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా అన్ని కుటుంబాలకు సహాయం అందిస్తుందని అన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహాయం చేస్తోంది. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ మినీ జపాన్‌గా మారుతోందని హామీ ఇచ్చాననీ, అప్పుడు చాలా మంది తనని ఎగతాళి చేశారని, కానీ ఆ మాటలు నిజమేనని నేడు మీరు నిరూపించారని అన్నారు. ఇక ఇక్కడి రైతులు విదేశాలకు పండ్లు, కూరగాయలు పంపడం సులువు కానుందనీ, రాజ్‌కోట్‌కి కేవలం విమానాశ్రయం మాత్రమే కాదు.. కొత్త శక్తిని-కొత్త విమానాన్ని అందించే పవర్‌హౌస్ కూడా ఉందని అన్నారు.
ద్రవ్యోల్బణం నియంత్రణకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రజలను అభివృద్దికి దూరం చేసిన వారు, ప్రజల ఆకాంక్షలు, ఆకాంక్షలను ఏనాడూ పట్టించుకోని వారు నేడు ఆగ్రహంతో ఉన్నారని ప్రధాన మంత్రి అన్నారు. ఎందుకంటే దేశప్రజల కలలు నెరవేరుతున్నాయని .. ఆ కలలను వారంతా చూస్తున్నారని అన్నారు.
ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) ఏర్పాటు చేసిన ప్రతిపక్ష పార్టీలను ప్రధాని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. నేడు దేశం ప్రగతి పథంలో ముందుకు సాగుతుంటే.. కొంతమందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని...ఈరోజుల్లో ఆ అవినీతిపరులు, రాజకుటుంబీకులు తమ జమాత్ పేరును మార్చుకున్నారని అన్నారు. ముఖాలు ఒకటే.. పని కూడా ఒకటే.. వారందరి పద్ధతులు,లక్ష్యాలు ఒకటే.. కానీ పేరు మాత్రమే మార్చబడిందని అన్నారు.
సుపరిపాలన హామీతో అధికారంలోకి వచ్చామని, తొమ్మిదేళ్లలో వాటిని నెరవేర్చామని చెప్పారు. కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దగ్గుతుందని అన్నారు. నేడు మన పొరుగు దేశాలలో ద్రవ్యోల్బణం 25-30 శాతం చొప్పున పెరుగుతోంది, కానీ భారతదేశంలో అలాంటి పరిస్థితి లేదని అన్నారు. మధ్యతరగతి వారి జేబులో మరింత ఎక్కువ పొదుపు చేసేందుకు మన ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ అన్నారు.
