అగ్నిపథ్ స్కీంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని నిర్ణయాలు మొదట్లో సరిగా లేనట్టుగా కనిపిస్తాయని, కానీ, రానూ రానూ అవి దేశ నిర్మాణంలో దోహదపడుతాయని తెలిపారు. ప్రధాని మోడీ ఈ రోజు కర్ణాటక పర్యటనలో ఉన్నారు. 

న్యూఢిల్లీ: కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న తరుణంలో కొన్ని నిర్ణయాలు మొదట్లో సరిగా లేవని అనిపిస్తాయని ప్రధాని మోడీ అన్నారు. కానీ, భవిష్యత్‌లో దేశ నిర్మాణానికి అవి కీలకంగా పని చేస్తాయని వివరించారు. బెంగళూరులో ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ ఈ రోజు మాట్లాడారు. వర్తమానంలో చాలా నిర్ణయాలు సరిగా లేవని అనిపిస్తాయని అన్నారు. కానీ, కాలం గడుస్తున్నా కొద్దీ ఆ నిర్ణయాలే దేశ నిర్మాణానికి దోహదపడతాయని చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఎలాంటి స్కీం పేరునూ ప్రస్తావించలేదు.

అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పలురాష్ట్రాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగానూ మారిన సంగతి తెలిసిందే. కానీ, ఈ స్కీంను వెనక్కి తీసుకునే అవకాశమే లేదన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తున్నది. మిలిటరీ సీనియర్ అధికారులు కూడా అదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకునే చాన్సే లేదని తెలిపారు. అంతేకాదు, ఈ అగ్నిపథ్ స్కీం కింద రిక్రూట్‌మెంట్లకూ ప్రకటనలూ చేశారు. ఈ స్కీంపై ఎంత వాదనలు, ఆందోళనలు జరుగుతున్నా కేంద్ర మంత్రులు మాత్రం వారి ఆందోళనలు, అనుమతుల గురించి మాట్లాడారు. నాలుగేళ్ల తర్వాత తమ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించాయి. ఈ విమర్శలపై ప్రధాని మోడీ కూడా ఇది రకు ప్రకటనల విడుదల చేయలేదు. 

కానీ, యువత, ప్రతిపక్షాలు మాత్రం అగ్నిపథ్ స్కీంపై వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న దారుణ నిర్ణయాల్లో తాజాది అగ్నిపథ్ స్కీం అని కాంగ్రెస్ దాడికి దిగింది. పెద్ద నోట్ల రద్దు, మూడు సాగు చట్టాలు వంటి వైఫల్య నిర్ణయాలు తీసుకున్నారని తెలిపింది. అంతేకాదు, పలువురు విమర్శకులు ఈ పథకాన్ని వెనక్కి తీసుకుంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.