ఎన్నికల కోసం ఫేక్ గ్యారెంటీలతో కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయని, అలాంటి పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  . 

తప్పుడు హామీలు ఇచ్చే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. తమకే గ్యారెంటీ లేని వారు.. హామీలతో కొత్త పథకాలను మీ ముందుకు తెస్తున్నారు. వారి హామీలో దాగి ఉన్న లోపాన్ని గుర్తించండి. తప్పుడు హామీల పేరుతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మధ్యప్రదేశ్ షాడోల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మ ఉచిత కరెంటు హామీ ఇచ్చినప్పుడు కరెంటు ధరలు పెరగడం ఖాయమన్నారు.

ఉచిత ప్రయాణానికి హామీ ఇస్తే ట్రాఫిక్ వ్యవస్థ కుప్పకూలినట్లేననీ, పింఛను హామీ ఇస్తే జీతం కూడా సకాలంలో అందకపోవడం ఖాయం. తక్కువ ధరకే పెట్రోలు ఇస్తామని హామీ ఇస్తే పన్ను పెంచబోతున్నారని అర్థం. వారికి ఉపాధిని పెంచుతామని హామీ ఇస్తే పరిశ్రమలు, వ్యాపారాలు కుప్పకూలిపోతున్నాయని అర్థం. కాంగ్రెస్ లాంటి పార్టీల గ్యారెంటీల వల్ల పేదలకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. గత 70 ఏండ్లలో వారు(కాంగ్రెస్) పేదలకు సరిపడా ఆహారం అందించలేకపోయిందనీ, కానీ తమ ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 80 కోట్ల మందికి పైగా ఉచిత రేషన్‌ అందిస్తుందని తెలిపారు. వారి పాలనలో పేదలకు తక్కువ ధరలో వైద్యం అందించలేకపోయాడు. కానీ, బీజేపీ ప్రభుత్వం ఆయుష్మాన్ కార్డు ఇచ్చి ఆరోగ్య బీమా ఇచ్చిందని పేర్కొన్నారు.

ప్రతిపక్షాల కూటమిపై ఫైర్ 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ.. కలిసి వస్తామని వాగ్దానం చేస్తున్న వారి(ప్రతిపక్షాలు) ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయనీ, వారి ఏదోక విషయంలో ఒకరినొకరు తిట్టుకుంటున్నారనీ, ప్రతిపక్షాల ఐక్యతకు హామీ లేదని అన్నారు. ఈ వంశపారంపర్య పార్టీలు తమ కుటుంబాల సంక్షేమాన్ని కోరుకుంటున్నాయనీ, సాధారణ కుటుంబాలను ముందుకు తీసుకెళ్తామన్న గ్యారెంటీ వారికి లేదని అన్నారు. అవినీతి ఆరోపణలు ఉన్నవారు బెయిల్‌తో బయట తిరుగుతున్నారనీ .. మోసాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న వారు ఓ వేదికపై కనిపిస్తున్నారని, వారు అవినీతి రహిత పాలన కొనసాగిస్తామంటే.. అది నమ్మశక్యం కాదని అన్నారు. 

అంతకు ముందు ప్రధాని మోడీ గిరిజన సంఘంతో మమేకమయ్యారు. మధ్యప్రదేశ్ షాడోల్ లో జిల్లాలోని పకారియాలో పకారియా గ్రామంలోని గిరిజన సంఘం నాయకులు, స్వయం సహాయక సంఘాలు , పెసా కమిటీ నాయకులతో పాటు ఫుట్‌బాల్ క్లబ్‌ల కెప్టెన్‌లతో సంభాషించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. దీంతో పాటు గిరిజనుల ఆందోళనలను ప్రతి స్థాయిలో తొలగించేందుకు కృషి చేశారు.