Asianet News TeluguAsianet News Telugu

‘కాలానికి అతీతంగా నిలబడ్డ మిత్రదేశం’.. ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో భేటీ అయ్యారు. 21వ వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనడానికి పుతిన్ ఈ రోజు రష్యా నుంచి ఢిల్లీ చేరుకున్నారు. మళ్లీ ఇదే రోజు రాత్రి ఆయన తిరిగి వెళ్లిపోనున్నారు. ఈ సమావేశానికి ముందు ఉభయ దేశాల రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులు 2+2 సమావేశాన్ని నిర్వహించారు. భారత ఒక గొప్ప శక్తి అని, కాలానికి అతీతంగా నిలబడి స్నేహాన్ని బలోపేతం చేస్తున్న దేశం అని పుతిన్ అన్నారు.

pm modi russia president putin met at delhis hyderabad house
Author
New Delhi, First Published Dec 6, 2021, 7:14 PM IST

న్యూఢిల్లీ: India ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi), Russia అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) దేశరాజధాని ఢిల్లీలో సమావేశం అయ్యారు. 21వ వార్షిక ద్వైపాక్షిక సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు ఢిల్లీకి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌ దగ్గర రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆహ్వానం పలికారు. వారిద్దరూ హైదరాబాద్‌ హౌజ్‌లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఇరువురూ ఉభయ దేశాల మధ్య బలైమన మైత్రిని ఆకాశానికి ఎత్తారు. భారత్ ఒక గొప్ప శక్తిగా తాము భావిస్తామని పుతిన్ అన్నారు. కాలానికి అతీతంగా ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబడ్డ దేశమని పొగిడారు.  

ప్రపంచంలో ఎన్నో దేశాలు తమ విధానాలను మార్చుకున్నాయని, మారుతున్న భౌగోళిక సమీకరణలు, ఇతర అంశాల రీత్యా ఎన్నో ప్రాథమిక మార్పులు చేసుకున్నాయని వివరించారు. కానీ, భారత్ మాత్రం రష్యాతో స్నేహ బంధంలో ఎంతమాత్రం మారలేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని రష్యాపై వెల్లడించారు. కరోనా మహమ్మారితో ఎన్నో సవాళ్లు ఎదురైనా భారత్, రష్యాల మధ్య బంధం మరింత అభివృద్ధి చెందడంలో వెనుకంజ పట్టలేదని పేరర్కొన్నారు. భారత్‌కు ప్రత్యేకమైన ఈ స్నేహబంధం మరింత బలపడుతూనే ఉన్నదని వివరించారు. కరోనా కాలంలోనూ ప్రత్యక్షంగా పుతిన్ భారత్‌కు రావడాన్ని హర్షించారు. 

వీరిద్దరి సమావేశంలో అఫ్ఘానిస్తాన్, ఉగ్రవాదం అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఉగ్రవాదానికి సంబంధించి తాము అన్ని కోణాల్లో అప్రమత్తంగా ఉన్నామని, దాన్ని నిర్మూలించడానికి తాము కట్టుబడి ఉన్నామని పుతిన్ అన్నారు. ఉగ్రవాదంపై పోరాడటమంటే.. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై, వ్యవస్థీకృత నేరాలపై పోరాడాటమేనని వివరించారు. ఆ ఉద్దేశంలోనే తాము అఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు మెరుగవ్వాలని కోరుకుంటున్నామని తెలిపారు.

ఇండియా తమకు సుదీర్ఘమైన మిత్ర దేశం అని పుతిన్ పేర్కొన్నారు. భారత్, రష్యాల మధ్య వాణిజ్యం పెరిగిందని తెలిపారు. భారత్ ఒక గొప్ప శక్తి అని, ఈ దేశంతో తమ మిలిటరీ ఒప్పందాలు అసమానంగా ఉన్నాయని తాము భావిస్తున్నామని చెప్పారు. ఈ ఉభయ దేశాల మధ్య వాణిజ్యం 38శాతం మేర పెరిగిందని, అంతరిక్షం సహా ఇతర రంగాల్లోనూ కలిసి పని చేస్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం ఉభయ దేశాల మధ్య పెట్టుబడులు సుమారు 3800 కోట్లు అని, రష్యా వైపు నుంచి కొంత ఎక్కువగా ఉన్నాయని పుతినర్ తెలిపారు. భారత దేశానికి మిలిటరీ, టెక్నికల్ అంశాల్లో తాము సహకరించినంతగా మరే దేశమూ సహాయం చేయలేదని చెప్పారు. సంయుక్తంగా తాము ఉన్నత సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామని, కొన్ని ఉత్పత్తులూ భారత్‌లో జరుగుతున్నాయని వివరించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశానికి ముందు ఉభయ దేశాలకు చెందిన రక్షణ, విదేశాంగ మంత్రులు సమావేశం అయ్యారు. పలు ఒప్పందాలపై సంతకాలు పెట్టారు. క్వాడ్ దేశాలతో భారత్ ఇది వరకు ఇలా 2+2 సమావేశాలు జరిపింది. తాజాగా, రష్యాతోనూ తొలిసారిగా 2+2 సమావేశం చేపట్టడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios