భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఒకే రోజు రెండు దేశాల అత్యుతన్న పురస్కారాలు లభించాయి. ఫిజీ దేశం ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘‘కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’’తో సత్కరించగా.. పపువా న్యూ గినియా ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘‘కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహు’’ను ప్రదానం చేసింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఒకే రోజు రెండు దేశాల అత్యుతన్న పురస్కారాలు లభించాయి. ఫిజీ దేశం ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘‘కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’’తో సత్కరించగా.. పపువా న్యూ గినియా ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘‘కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహు’’ను ప్రదానం చేసింది. తొలుత ఫిజీ ప్రధానమంత్రి సితివేని రబుకా ‘‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’’తో మోదీని సత్కరించారు. ప్రధాని మోదీ ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ఫిజీ ఈ పురస్కారం అందించింది. ఫిజియేతరులు కొద్దిమంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారు.
మరోవైపు పపువా న్యూ గినియా భారత ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘‘కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహు’’ను ప్రదానం చేసింది. పపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ సర్ బాబ్ దాడే ఈ పురస్కారాన్ని ప్రధాని మోదీకి బహుకరించారు. ఇప్పటి వరకు పపువా న్యూ గినియా నివాసితులు కానీ కొద్దిమంది మాత్రమే ఈ పురస్కారం అందుకున్నారు. ఈ మేరకు భారత ప్రధాని మంత్రి కార్యాలయం వివరాలను వెల్లడించింది.
గతంలో ప్రధాని మోదీకి వివిధ దేశాలు ప్రదానం చేసిన కొన్ని అంతర్జాతీయ అవార్డులు..
1. ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ (ముస్లిమేతర ప్రముఖులకు సౌదీ అరేబియా అత్యున్నత గౌరవం) –2016
2. స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్ అత్యున్నత పౌర గౌరవం) –2016
3. గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డు (విదేశీ ప్రముఖులకు పాలస్తీనా అత్యున్నత గౌరవం) –2018
4. ఆర్డర్ ఆఫ్ జాయెద్ అవార్డు (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అత్యున్నత పౌర గౌరవం) -2019
5. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అవార్డు (రష్యా అత్యున్నత పౌర గౌరవం) –2019
6. ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్ (విదేశీ ప్రముఖులకు మాల్దీవుల అత్యున్నత గౌరవం) –2019
7. కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసెన్స్ (ఈ బహ్రెయిన్ పురస్కారం - ఫస్ట్ క్లాస్ గల్ఫ్ దేశంచే అత్యున్నత గౌరవం) -2019
8. యుఎస్ ప్రభుత్వంచే లెజియన్ ఆఫ్ మెరిట్ (అత్యుత్తమ సేవలు, విజయాల పనితీరులో అనూహ్యంగా ప్రతిభ కనబరిచినందుకు యునైటెడ్ స్టేట్స్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ అవార్డు)–2020
9. ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో.. భూటాన్ డిసెంబర్ 2021లో అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పోతో ప్రధాని మోదీని సత్కరించింది.
ఆర్గనైజేషన్స్/ఫౌండేషన్స్ అందించిన అవార్డులు..
1. సియోల్ శాంతి బహుమతి (మానవజాతి సామరస్యం, దేశాల మధ్య సయోధ్య, ప్రపంచ శాంతికి కృషి చేయడం ద్వారా తమదైన ముద్ర వేసిన వ్యక్తులకు సియోల్ శాంతి బహుమతి కల్చరల్ ఫౌండేషన్ ద్వైవార్షికంగా ఈ అవార్డు ప్రదానం చేస్తుంది) -2018
2. ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు (యూఎన్ అత్యున్నత పర్యావరణ గౌరవం) -2018
3. స్వచ్ఛ భారత్ అభియాన్ -2019కు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా గ్లోబల్ గోల్‌కీపర్ అవార్డు
4.కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేట్స్ CERA ద్వారా గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ లీడర్‌షిప్ అవార్డు (ప్రపంచ ఇంధనం, పర్యావరణం భవిష్యత్తు పట్ల నాయకత్వం యొక్క నిబద్ధతను ఈ అవార్డు గుర్తిస్తుంది) -2021
