కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ‘‘ది కేరళ స్టోరి’’ చిత్రం గురించి ప్రస్తావించారు. ఈ చిత్రం ఉగ్రవాద కుట్రను బట్టబయలు చేస్తుందని చెప్పారు. 

బెంగళూరు: కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ‘‘ది కేరళ స్టోరి’’ చిత్రం గురించి ప్రస్తావించారు. ఈ చిత్రం ఉగ్రవాద కుట్రను బట్టబయలు చేస్తుందని చెప్పారు. మోదీ శుక్రవారం బళ్లారిలో తన ఎన్నికల ప్రసంగంలో మాట్లాడుతూ.. ‘‘ది కేరళ స్టోరి కథ కేవలం ఒక రాష్ట్రంలో జరిగిన టెర్రరిస్టు కుట్రల ఆధారంగా సాగుతుందని అంటున్నారు. దేశంలోని అందమైన రాష్ట్రమైన కేరళలో ప్రజలు ఎంతో కష్టపడి, ప్రతిభావంతులుగా ఉన్నారని.. అలాంటి చోట జరుగుతున్న తీవ్రవాద కుట్రను ఈ చిత్రంలో ఆవిష్కరించారు’’ అని అన్నారు. 

‘‘బాంబులు, తుపాకులు, పిస్టల్స్ శబ్దాలు వినబడుతున్నాయి.. కానీ సమాజాన్ని లోపల నుండి ఖాళీ చేయడానికి తీవ్రవాద కుట్ర శబ్దం లేదు. ఈ ఉగ్రరూపంపై కోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి ఉగ్రవాద కుట్రతో రూపొందిన 'కేరళ కథ' సినిమా గురించి ఈ రోజుల్లో చాలా చర్చలు జరుగుతున్నాయి’’ అని ప్రధాని మోదీఅన్నారు. 

‘‘ది కేరళ స్టోరీ ఉగ్రవాదం యొక్క అసహ్యమైన సత్యాన్ని చూపుతుంది. ఉగ్రవాదుల రూపకల్పనను బట్టబయలు చేస్తుంది. ఉగ్రవాదంపై తీసిన చిత్రాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని. ఉగ్రవాద ధోరణులతో నిలుస్తోంది. సమాజాన్ని ధ్వంసం చేస్తున్న ఈ ఉగ్రవాద ధోరణితో నేడు కాంగ్రెస్ నిలబడుతుంది. అంతే కాదు ఇలాంటి ఉగ్రవాద ధోరణులు ఉన్న వారితో కాంగ్రెస్ బ్యాక్‌డోర్‌లో రాజకీయ బేరసారాలు కూడా జరుపుతోంది’’ అని ప్రధాని మోదీ ఆరోపించారు. 

Scroll to load tweet…


కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు కోసం ఉగ్రవాదానికి లొంగిపోయిందని ప్రధాని మోదీ ఆరోపించారు. అలాంటి పార్టీ ఎప్పుడైనా కర్ణాటకను కాపాడగలదా? అని ప్రశ్నించారు. అలాంటి భయానక వాతావరణంలో ఇక్కడి పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు, వ్యవసాయం, ఉజ్వల సంస్కృతి నాశనం అవుతాయని అన్నారు. కర్ణాటకను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మార్చేందుకు శాంతిభద్రతలు అత్యంత ముఖ్యమైనవని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదంపై బీజేపీ ఎప్పుడూ కఠినంగా వ్యవహరిస్తోందని మోదీ చెప్పారు. 

ఇదిలా ఉంటే.. అదా శర్మ నటించిన ‘‘ది కేరళ స్టోరీ’’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రాన్ని విపుల్ అమృతల్ షా నిర్మించగా, సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 26న ది కేరళ స్టోరీ ట్రైలర్ విడుదల కాగా వివాదం రాజుకుంది. ఆ చిత్ర కంటెంట్ ఓ మతాన్ని కించపరిచే విధంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తమ చిత్రం మతానికి వ్యతిరేకం కాదని.. తీవ్రవాదానికి వ్యతిరేకమని చిత్రబృందం చెబుతోంది.