Modi Putin Phone Call: ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రస్తుత పరిస్థితులపై ఫోన్ లో చర్చించారు. పుతిన్ ట్రంప్ తో జరిగిన అలస్కా సమావేం భేటీ వివరాలు వివరించారు. ఇరువురు నేతలు రష్యా-భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అంగీకరించారు

DID YOU
KNOW
?
ఉక్రెయిన్-రష్యా వార్
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణాలు: నాటో విస్తరణ, క్రిమియా ఆక్రమణ, ఉక్రెయిన్ పశ్చిమానికి చేరువ, భూభాగ-భద్రతా ప్రయోజనాలపై రష్యా ఆందోళనలు.

Modi Putin Phone Call: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పుతిన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో గత వారం అలాస్కాలో జరిగిన తన సమావేశం వివరాలను మోడీకి తెలియజేశారు. పుతిన్ తన చర్చలపై తన అంచనాలను కూడా పంచుకున్నారు.

ఉక్రెయిన్ సమస్యపై భారత్ స్టాండ్ 

సంభాషణలో ప్రధానమంత్రి మోడీ ఉక్రెయిన్ యుద్ధానికి శాంతియుత పరిష్కారం మాత్రమే మార్గమని మరోసారి స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ, “శాంతియుత చర్చలు, దౌత్యంతో ముందుకు సాగాలని” పుతిన్‌కు తెలిపారు. భారత్ నిరంతరం ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతి పరిష్కారం కోసం కృషి చేస్తోందని మోడీ గుర్తుచేశారు.

సోషల్ మీడియా లో మోడీ పోస్ట్ 

ఫోన్ సంభాషణ అనంతరం ప్రధానమంత్రి మోడీ సోషల్ మీడియా వేదిక X లో ఈ వివరాలు పోస్ట్ చేశారు. “నా మిత్రుడు అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేసి, అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో తన సమావేశంపై వివరాలు పంచుకున్నందుకు కృతజ్ఞతలు. భారత్ ఎల్లప్పుడూ ఉక్రెయిన్ సమస్యకు శాంతియుత పరిష్కారానికే మద్దతు ఇస్తుంది. ఈ క్రమంలో అన్ని ప్రయత్నాలకు మేము మద్దతు ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో మా చర్చలు కొనసాగాలని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు. 

— Narendra Modi (@narendramodi) August 18, 2025

ఇండియా–రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం

ప్రపంచ సమస్యలతో పాటు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలు కూడా చర్చలో ప్రస్తావించారు. ముఖ్యంగా ఇండియా–రష్యా ప్రత్యేక, ప్రాధాన్య వ్యూహాత్మక భాగస్వామ్యం ను మరింత బలోపేతం చేయాలని ఇద్దరు నాయకులు అంగీకరించారు. రక్షణ, ఇంధనం, వాణిజ్యం వంటి అనేక రంగాల్లో సహకారం పెంపొందించాలని నిర్ణయించారు.

ప్రపంచ శాంతికి భారత్ సందేశం

భారత్, రష్యా మధ్య చారిత్రక సంబంధాలు ఎల్లప్పుడూ బలంగానే ఉన్నాయి. ఈ తాజా ఫోన్ కాల్ ఆ బంధాన్ని మరింత స్పష్టంగా చూపించింది. అదే సమయంలో ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న ఈ సవాళ్ల సమయంలో భారతదేశం అంతర్జాతీయ వేదికపై పంపుతున్న సందేశం కూడా ఉంది. ప్రధానమంత్రి మోడీ స్పష్టంచేసినట్టుగా, “సమస్యలు శాంతియుత మార్గాల్లోనే పరిష్కరించాలి” అనేది భారత్ స్థిరమైన వైఖరి. ఈ ఫోన్ సంభాషణతో భారత్ ఒక శాంతియుత పరిష్కారం కోసం కృషి చేస్తోందన్న అంశం మళ్లీ చాటింది.