షిర్డి ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు: పలు ప్రాజెక్టులు ప్రారంభం

మహారాష్ట్రలోని షిర్డి ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 PM Modi performs pooja at Shirdi Saibaba, inaugurates new darshan queue complex lns


ముంబై: మహారాష్ట్రలోని షిర్డి సాయిబాబా ఆలయంలో  గురువారంనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రధాన మంత్రి వెంట మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బాయిస్, సీఎం ఏక్ నాథ్ షిండే,డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు.ఇవాళ మధ్యాహ్నం  మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని షిర్డీ విమానాశ్రయానికి  ప్రధాని మోడీ చేరుకున్నారు.

 ఎయిర్ పోర్టు నుండి  నేరుగా ప్రధాని షిర్డీ ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం కొత్త దర్శనం క్యూ కాంప్లెక్స్ ను  మోడీ ప్రారంభించారు. రూ. 112 కోట్ల వ్యయంతో  నిర్మించిన కొత్త కాంప్లెక్స్, భక్తులకు వెయిటింగ్ రూమ్ ను ప్రారంభించారు.

10 వేల మందికి పైగా కూర్చునే సామర్ధ్యంతో  వెయిటింగ్ హాల్ ను నిర్మించారు.  వెయిటింగ్ హల్ లో  టాయిలెట్లు, బుకింగ్ కౌంటర్లు, ప్రసాదం కౌంటర్లు, ఇన్ఫర్మేషన్ సెంటర్లు కూడ ఏర్పాటు చేశారు. కొత్త ఎయిర్ కండిషన్ కాంప్లెక్స్ పూర్తి చేయడానికి నాలుగేళ్ల కంటే ఎక్కువ సమయం పట్టింది.  ఈ కాంప్లెక్స్ లో  మొదటి, రెండో అంతస్తులో  12 పెద్ద హాల్స్  ఉన్నాయి.

ప్రతి రోజూ  సుమారు  50వేల మంది ఆలయానికి వస్తారని  షిర్డి ట్రస్ట్ బోర్డ చెబుతుంది.  వీకేండ్ లలో  భక్తుల సంఖ్య 80వేలుగా ఉంటుంది.  రామనవమి,  దసరా, క్రిస్ట్ మస్ వంటి పర్వదినాల్లో  రెండు లక్షల నుండి  రెండు లక్షల యాభై వేల మంది భక్తులు వస్తుంటారు. ప్రతి ఏటా  షిర్డి ఆలయానికి  రూ. 400 కోట్ల విరాళాలు వస్తున్నాయి.

కొత్త దర్శన కాంప్లెక్స్ లో  45 వేల మంది భక్తుల మొబైల్, పాదరక్షలు భద్రపర్చేందుకు  14,538  లాకర్లను ఏర్పాటు చేశారు. వికలాంగులు, వారి సంరక్షకులకు  ప్రత్యేక సౌకర్యాలు కూడ ఏర్పాటు చేశారు. నాలుగేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ షిర్డి పర్యటించడం రెండో సారి . 2018లో సాయిబాబా  100వ వర్ధంతి సందర్భంగా  మోడీ పర్యటించారు.

షిర్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత  నీల్ వాండే డ్యామ్ వద్ద జలపూజ నిర్వహించారు. ఆ తర్వాత ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం  ఈ డ్యామ్ ను జాతికి అంకితం చేశారు.ఈ డ్యామ్ ద్వారా 182 గ్రామాలకు  మంచినీరు అందనుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios