సారాంశం
PM Modi podcast with Lex Fridman: పాకిస్తాన్‌పై ప్రధాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టెర్రరిజం ఎక్కడ మొదలైందో ప్రపంచానికి తెలుసనీ, శాంతి కోసం ట్రై చేసినా పాకిస్తాన్ తీరు మారలేదని అన్నారు.
PM Modi podcast with Lex Fridman: అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ టెర్రరిజానికి సపోర్ట్ చేస్తోందనీ, ఫండింగ్ కూడా చేస్తోందని హాట్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోందని, ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థల్లో మార్పులు రావాలంటూ కీలక అంశాలను ప్రస్తావించారు.
టెర్రరిజంపై పాకిస్తాన్‌కు మోడీ స్ట్రాంగ్ వార్నింగ్
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పాకిస్తాన్‌ను (Pakistan) గట్టిగా హెచ్చరిస్తూ టెర్రరిజం ఎక్కడ మొదలైందో ప్రపంచానికి తెలుసన్నారు. పాకిస్తాన్ చాలా కాలంగా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోందని, దీని వల్ల ఇండియాకే కాదు ప్రపంచానికి కూడా నష్టం జరుగుతోందని అన్నారు.
పాకిస్తాన్‌తో శాంతి కోసం ఇండియా చేసిన ప్రయత్నాలను ప్రధాని మోడీ గుర్తు చేశారు. లాహోర్ యాత్ర (Lahore Visit) నుంచి ప్రమాణ స్వీకారానికి పాకిస్తాన్‌ను పిలవడం వరకు ఇండియా చాలాసార్లు స్నేహం కోసం చేయి చాపిందన్నారు. అయితే, పాకిస్తాన్ మాత్రం శత్రుత్వం చూపిందని చెప్పారు. పాకిస్తాన్ ప్రజలకు హింస, టెర్రరిజం లేని భవిష్యత్తు ఉండాలని మోడీ ఆకాంక్షించారు. పాకిస్తాన్ తన తప్పుల నుంచి నేర్చుకుని మంచి దారిలో నడుస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ప్రపంచ పోరాటాలు, ఐక్యరాజ్యసమితిపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్, అమెరికా-చైనా సంబంధాల్లో పోరాటాలు, ప్రపంచంలో పెరుగుతున్న టెన్షన్స్‌పై భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ ప్రతి దేశం బార్డర్స్‌ను బయటపెట్టిందని అన్నారు. దీని నుంచి నేర్చుకునే బదులు ప్రపంచం మరింతగా విడిపోయిందని చెప్పారు. రూల్స్‌ను అమలు చేయడంలో ఐక్యరాజ్యసమితిలాంటి సంస్థలు ఫెయిల్ అయ్యాయనీ, శాంతిని కాపాడటానికి పెట్టిన సంస్థలు ఇప్పుడు విలువ కోల్పోతున్నాయని విమర్శించారు. రూల్స్‌ను పట్టించుకోని వాళ్లకు ఎలాంటి శిక్ష ఉండదని అన్నారు. ప్రపంచం ఒకరిపై ఒకరు ఆధారపడి ఉందని, ఏ దేశం ఒంటరిగా నిలబడలేదని మోడీ అన్నారు. శాంతి, సహకారం, అభివృద్ధి ఒక్కటే ముందుకు వెళ్లే మార్గమని చెప్పారు.
AP SSC Public Examinations: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం