MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • AP SSC Public Examinations: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

AP SSC Public Examinations: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

AP SSC Public Examinations: ఆంధ్రప్రదేశ్ లో సోమవారం (మార్చి 17) నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్ర‌మంలోనే సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ చెబుతూ ఉచితంగా ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణ స‌దుపాయం క‌ల్పించింది.   

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Mar 16 2025, 08:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
AP SSC Public Examinations: Free travel in RTC buses for students appearing for class 10th exams

AP SSC Public Examinations: Free travel in RTC buses for students appearing for class 10th exams

AP SSC Public Examinations: ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. రాష్ట్రంలో సోమవారం ( మార్చి 17)  నుండి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. NCERT సిలబస్ అమలు చేయ‌డం, ఆంగ్ల మాధ్యమ బోధన ప్రవేశపెట్టడం వంటి పాఠశాల విద్యలో కొత్త సంస్కరణల త‌ర్వాత జ‌రుగుతున్న మొదటి ప‌రీక్ష‌లు ఇవి. విద్యార్థులకు ప్రయాణ ఇబ్బంది కలగకుండా ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యం అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
AP SSC Public Examinations: Free travel in RTC buses for students appearing for class 10th exams

AP SSC Public Examinations: Free travel in RTC buses for students appearing for class 10th exams

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసే విద్యార్థుల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం 

విద్యార్థుల ర‌వాణాను సుల‌భ‌త‌రం చేయ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసే విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం క‌ల్పించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ప్ర‌యాణ విష‌యంలో ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వారికి ఫ్రీ బ‌స్సు ప్రయాణ స‌ర్వీసులు అందిస్తున్న‌ట్టు తెలిపారు. విద్యార్థులు త‌మ‌ హాల్‌టికెట్‌ చూపిస్తే ఏపీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా పరీక్ష కేంద్రాల‌కు వెల్ల‌వ‌చ్చు. 

33
AP SSC Public Examinations: Free travel in RTC buses for students appearing for class 10th exams

AP SSC Public Examinations: Free travel in RTC buses for students appearing for class 10th exams

మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 1 వరకు ఏపీ 10వ త‌ర‌గతి పరీక్షలు 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ 10వ త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు మార్చి 17 నుండి ఏప్రిల్ 1 వరకు జరుగుతాయి. రోజువారీ షెడ్యూల్ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. ఫిజికల్, బయాలజీ పేపర్లకు పరీక్షల స‌మ‌యం ఉదయం 9:30 నుండి 11:30 వరకు ఉంటుంది.

మొత్తం 5,64,064 మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాయనుండగా, 51,069 మంది విద్యార్థులు తెలుగు మీడియంలో పరీక్షలకు హాజరుకానున్నారు. సార్వత్రిక పాఠశాలల నుండి 30,334 మంది విద్యార్థులు 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు హాజరుకానున్నారు. 

SSC రెగ్యులర్ పరీక్షలకు ఎనిమిది ఫ్లయింగ్ స్క్వాడ్‌లను, ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను కేటాయించారు. 40 కేంద్రాలలో సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించారు. అదనంగా 37 స్టోరేజ్ పాయింట్లు, కస్టోడియల్ అధికారులను నియమించారు. పదకొండు స‌మ‌స్యాత్మ‌క పరీక్షా కేంద్రాలను గుర్తించారు. ఇక్క‌డ ప‌రీక్ష‌లు సజావుగా జరిగేలా CCTV నిఘాను ఉంచారు. అత్యవసర పరిస్థితుల కోసం 24x7 హెల్ప్‌లైన్ 9032185001 ఏర్పాటు చేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Recommended image2
Now Playing
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
Recommended image3
Now Playing
స్టూడెంట్స్ మాటలకూ పొట్టపగిలేలా నవ్వుతున్న Chandrababu | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved