Asianet News TeluguAsianet News Telugu

సోమ్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మోడీ

గుజరాత్  రాష్ట్రంలోని  సోమ్ నాథ్  ఆలయంలో  ఆదివారంనాడు  ప్రత్యేక  పూజలు నిర్వహించారు.  మూడు  రోజుల పాటు  గుజరాత్  ఎన్నికల  ప్రచారంలో  పాల్గొనేందుకు  మోడీ  రాష్ట్రానికి  వచ్చారు.ఇవాళ  రెండో రోజు పలు  ఎన్నికల ప్రచార  సభల్లో  మోడీ  పాల్గొంటారు. 

PM Modi offers prayers at Somnath temple
Author
First Published Nov 20, 2022, 11:31 AM IST

గాంధీనగర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఆదివారంనాడు  సోమ్  నాథ్  ఆలయంలో ఆదివారంనాడు ప్రత్యేక  పూజలు నిర్వహించారు.  గుజరాత్  రాష్ట్రంలో  ఎన్నికల ప్రచారంలో  భాగంగా  నిన్న  ప్రధాని  రాష్ట్రానికి  వచ్చారు. ఇవాళ  సౌరాష్ట్ర రీజియన్  లో ప్రధాని  మోడీ  ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.సోమ్  నాథ్ ఆలయంలో  పూజలు నిర్వహించిన  తర్వాత  వెరావల్  పట్టణంలో  నిర్వహించే  ఎన్నికల ర్యాలీలో  మోడీ  పాల్గొంటారు.  ఈ ర్యాలీ  తర్వాత  మోడీ  రాజ్  కోట్  జిల్లాలోని  ధోరాజీలో  జరిగే  ఎనంనికల సభలో  పాల్గొంటారు.  అనంతరం  అమ్రేలి, బోటాడ్ లలో  జరిగే  ర్యాలీలో  పాల్గొంటారు. 

 

ఈ  ఏడాది  డిసెంబర్  1, 5 తేదీల్లో  గుజరాత్  అసెంబ్లీ కి  ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్  8న  ఓట్ల  లెక్కింపు  జరగనుంది.  నిన్న  దక్షిణ  గుజరాత్  రాష్ట్రంలోని  వల్సాద్   జిల్లాలో మోడీ ఎన్నికల  ప్రచారాన్ని  నిర్వహించారు.  
గుజరాత్  అసెంబ్లీ  ఎన్నికల  నేపథ్యంలో  ఎన్నికల  ప్రచారంలో ప్రధాని  నరేంద్ర మోడీ  విస్తృతంగా  ప్రచారం  నిర్వహిస్తున్నారు. ఇవాళ  ప్రధాని నరేంద్ర మోడీ  పాల్గొనే  సౌరాష్ట్ర  రీజియన్  లో గత  ఎన్నికల్లో  బీజేపీ ఒక్క స్థానంలో కూడా  గెలవలేదు.దీంతో  ఈ  ప్రాంతంలో మోడీ  ఎన్నికల  ప్రచార  సభలను  బీజేపీ  ఏర్పాటు  చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ  రేపు సురేంద్రనగర్ , భరూచ్ , నవ్ సారిలీలో  మూడు  ర్యాలీల్లో  పాల్గొంటారు.కాంగ్రెస్ నేత  రాహుల్  గాంధీ  రేపరర  నవ్ సారిలో  పర్యటిస్తారని సమాచారం. అయితే  ప్రధాని  మోడీ  కూడా రేపు  నవ్ సారిలో  ఎన్నికల  ప్రచార సభలో  పాల్గొంటారు. 

మూడు  రోజులపాటు  ప్రధాని మోడీ  25 ఎన్నికల  ర్యాలీలో  పాల్గొంటారు. కేంద్ర హోంశాఖ  మంత్రి అమిత్  షా,  బీజేపీ  జాతీయ  అధ్యక్షుడు  జేపీ నడ్డాలు  కూడా  రానున్న  రోజుల్లో  మరిన్ని  ఎన్నికల  సభల్లో  పాల్గొంటారు. బీజేపీ రాష్ట్రాల  ముఖ్యమంత్రులతో  పాటు   బీజేపీకి  చెందిన  40  రాష్ట్రాల స్టార్  క్యాంపెయినర్ల జాబితాను  బీజేపీ ప్రకటించింది.2017  లో  జరిగిన  గుజరాత్  అసెంబ్లీ  ఎన్నికల్లో  182  అసెంబ్లీ  స్థానాల్లో బీజేపీ 99  అసెంబ్లీ సీట్లను  కైవసం చేసుకుంది.  అయితే  డిసెంబర్ లో జరిగే  ఎన్నికల్లో రాష్ట్రంలో  కనీసం  140  అసెంబ్లీ  స్థానాలను  దక్కించుకోవాలని  బీజేపీ  లక్ష్యంగా  పెట్టుకొని పనిచేస్తుంది.గుజరాత్  రాష్ట్రంలో  27  ఏళ్లుగా  బీజేపీ  పాలిస్తుంది. ఈ రాష్ట్రానికి  సుదీర్ఘ కాలంగా  ఈ రాష్ట్రానికి  సుదీర్ఘ కాలంగా  మోడీ  సీఎంగా  పనిచేశారు.

 
 

Follow Us:
Download App:
  • android
  • ios