చెన్నై: తమిళనాడు మాజీ సీఎం కరుణానిధికి నివాళులర్పించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం నాడు చెన్నైకు చేరుకొంటారు.పలు రాజకీయపార్టీల నేతలు, పలువురు ప్రముఖులు చెన్నైకు చేరుకొంటున్నారు.

మంగళవారం సాయంత్రం డీఎంకె చీఫ్ కరుణానధి కావేరీ ఆసుపత్రిలో చనిపోయారు. కరుణానిధి మృతి విషయం తెలుసుకొన్న  వెంటనే పలువురు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. బుధవారం నాడు మోడీ చెన్నై చేరుకొంటారు.

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం రాత్రి చెన్నై చేరుకొన్నారు. కరుణానిధి బౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. కేరళ సీఎం విజయన్ బుధవారం నాడు ఉదయం ఏడుగంటలకు చెన్నై చేరుకొంటారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బుధవారం నాడు మధ్యాహ్నం చెన్నై చేరుకొంటారు.