Asianet News TeluguAsianet News Telugu

మాట నిలబెట్టుకున్న మోదీ.. తన స్కెచ్‌తో సందడి చేసిన ఆకాంక్షకు లేఖ.. అందులో ఏం రాశారంటే..

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ.. తన స్కెచ్ వేసినందుకు ఒక బాలికను అభినందించారు. ఆ బాలికకు లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. తాజాగా ప్రధాని తన హామీని నిలబెట్టుకున్నారు.

PM Modi letter to little girl holding his sketch at Chhattisgarh rally ksm
Author
First Published Nov 4, 2023, 11:38 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. కాంకేర్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో.. ఓ బాలిక ఆయన దృష్టిని ఆకర్షించారు. చేతిలో తన స్కెచ్‌ పట్టుకుని ఉన్న బాలికను ప్రధాని మోదీ చాలా మెచ్చుకున్నారు. బాలిక గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నేను మీ స్కెచ్ చూశాను, మీరు అద్భుతంగా పని చేశారు’’ అని ప్రధాని మోదీ అన్నారు. అలా స్కెచ్ పట్టుకుని నిలబడితే అలసిపోతావని కూడా ప్రధాని మోదీ బాలికతో అన్నారు. అంతేకాకుండా ఆ స్కెచ్‌ను తన వద్దకు తీసుకురావాలని ప్రధాని మోదీ పోలీసు అధికారులను కూడా కోరారు. ఆ బాలిక వివరాలు కూడా తెలుపాలని కోరిన ప్రధాని మోదీ.. ఆమెకు లేఖ రాస్తానని కూడా చెప్పారు. దీంతో జనం నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. 

అయితే తాజాగా ప్రధాని మోదీ తన మాటను నిలబెట్టుకున్నారు. ఆ బాలికకు లేఖ రాశారు. ఆ లేఖలో.. భారత్‌లోని కుమార్తెలు దేశానికి ఉజ్వల భవిష్యత్తు అని పేర్కొన్నారు. కష్టపడి చదివి.. ముందుకు సాగాలని బాలికకు సూచించారు. ‘‘ప్రియమైన ఆకాంక్ష.. ఆశీర్వాదాలు.. కాంకేర్ కార్యక్రమానికి మీరు తెచ్చిన స్కెచ్ నాకు చేరింది. ఈ ఆప్యాయత వ్యక్తీకరణకు చాలా ధన్యవాదాలు. భారతదేశపు కుమార్తెలు దేశానికి ఉజ్వల భవిష్యత్తు. మీ అందరి నుంచి నేను పొందుతున్న ఈ ఆప్యాయత, అనుబంధం దేశ సేవలో నాకు లభించే బలం. మన కుమార్తెల కోసం ఆరోగ్యకరమైన, సురక్షితమైన, సుసంపన్నమైన దేశాన్ని నిర్మించడమే మా లక్ష్యం.

 

ఛత్తీస్‌గఢ్ ప్రజల నుంచి నాకు ఎప్పుడూ ఎంతో ప్రేమ అందుతుంది. రాష్ట్ర ప్రజలు కూడా దేశ ప్రగతి పథంలో ఉత్సాహంగా సహకరించారు. రాబోయే 25 సంవత్సరాలు మీలాంటి యువ స్నేహితులకు, దేశానికి ముఖ్యమైనవి. ఈ సంవత్సరాల్లో మన యువ తరం, ముఖ్యంగా మీలాంటి కుమార్తెలు, వారి కలలను నెరవేరుస్తారు. దేశ భవిష్యత్తుకు కొత్త దిశను అందిస్తారు. మీరు కష్టపడి చదివి, ముందుకు సాగండి. మీ విజయాలతో మీ కుటుంబానికి, సమాజానికి కీర్తిని తెస్తారు. మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలతో..’’ అని మోదీ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios