Asianet News TeluguAsianet News Telugu

కరోనా వాక్సినేషన్ డ్రైవ్ ని ప్రారంభించిన ప్రధాని,

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వాక్సినేషన్ డ్రైవ్ ని నేటి ఉదయం ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఉదయం 10.30 కు ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించి వాక్సిన్ ని విడుదల చేసారు.

PM Modi launches COVID Vaccination Drive
Author
New Delhi, First Published Jan 16, 2021, 11:21 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వాక్సినేషన్ డ్రైవ్ ని నేటి ఉదయం ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఉదయం 10.30 కు ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించి వాక్సిన్ ని విడుదల చేసారు. దేశంలోని అనేక వాక్సినేషన్ కేంద్రాలు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాయి.  నేడు మూడు లక్షల మంది వైద్య సిబ్బందికి ఈ టీకాను వేయనున్నారు. 

ఈ సందర్భంగా కరోనా వాక్సిన్ పై యుద్ధంలో ముందుండి పోరాడిన ఫ్రంట్ లైన్ వర్కర్లను గుర్తుచేస్తూ మోడీ కన్నీరు పెట్టుకున్నారు. ఉబికివస్తున్న కన్నీరుని ఆపుకుంటూ వారి సేవలను గుర్తు చేసుకున్నారు. చాలా మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ దేశ ప్రజలకు ఈ కరోనా కు మధ్యలో అడ్డుగోడలుగా నిలబడ్డారని, ఈ పోరాటంలో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 

Also Reaad: భారత్‌లో కొత్తగా ఐదుగురికి స్ట్రెయిన్.. 114కి చేరిన కేసుల సంఖ్య

వైద్య సిబ్బంది సేవలకు ఆదరాంజలి ఘటిస్తూ.... తొలి వాక్సిన్ ని వారికే అందివ్వనున్నట్టు తెలిపారు మోడీ. గత సంవత్సరం ఇదే రోజున తొలి కరోనా అడ్వైజరీని ప్రభుత్వం జారీ చేసిందని, ..... నాటి నుండి సంవత్సరం లోపు  కూడా మందు భారత్ కనుగొనగలిగిందని ఈ సందర్భంగా ప్రధాని మన శాస్త్రవైజ్ఞానికులను ప్రశంసించారు. 

కరోనా మహమ్మారి జనవరి 30వ తేదీన తొలి కేసు వస్తే దానికి రెండు వారల ముందే తొలి కమిటీని వేయడం జరిగిందని, ఇక అక్కడి నుండి ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు జనతా కర్ఫ్యూని విధించి ప్రజలను లాక్ డౌన్ కి సిద్ధం చేశామని తెలిపారు. లాక్ డౌన్ నిర్ణయం అంత తేలికైంది కాదని... ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకోగలిగామని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

కరోనా వేళ వివిధ దేశాల్లో చిక్కుకున్న  భారతీయులను వెనక్కి తీసుకొచ్చేనందుకు వందే భారత్ మిషన్ లో భాగంగా విమానాలను నడిపిందని, కేవలం భారతీయులనే కాకుండా ఇతర దేశస్థులను కూడా వెనక్కి తీసుకొచ్చిందని చెప్పారు. వివిధ దేశాల్లో భారతీయ కరోనా టెస్టింగ్ మెషిన్లను ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. 

కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ వల్ల ఆర్ధిక వ్యవస్థ మీద దెబ్బ పడ్డప్పటికీ.... భారత్ దాని నుండి త్వరగా పుంజుకుంటుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారతీయ వాక్సిన్ పై అనేక పుకార్లు పుట్టిస్తున్నారని... అటువంటివేవీ నమ్మొద్దని... పూర్తిగా ఈ వాక్సిన్ సురక్షితమైనదని తెలిపారు మోడీ. 

వాక్సిన్ వచ్చింది కదా అని అలక్ష్యంగా ఉండొద్దని... మాస్కు, రెండు గజాల దూరం, చుట్టుపక్కల పరిశుభ్రత పాటిస్తూనే ఉండాలని ప్రధాని ఈ సందర్భంగా కోరారు. వాక్సిన్ వచ్చినప్పటికీ... అన్ని చర్యలను పాటించాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్రమోడీ. తొలి డోస్ తరువాత వెంటనే ఇమ్మ్యూనిటి ఓపెరగదని, రెండవ డోస్ తరువాత మాత్రమే ఇమ్మ్యూనిటి ఒరుగుతుందని ఈ సందర్భంగా మోడీ గుర్తు చేసారు. 

Follow Us:
Download App:
  • android
  • ios