న్యూఢిల్లీ:దేశంలో కరోనా పరిస్థితి, లాక్‌డౌన్ పొడిగించాలా, వద్దా అనే విషయమై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ చర్చించారు.
సోమవారం నాడు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కనీసం తొమ్మిది మంది ముఖ్యమంత్రులు మోడీతో పలు అంశాలపై చర్చిస్తున్నారు. లాక్ డౌన్ పొడిగింపుపై సమీక్షతో పాటు లాక్ డౌన్ పొడిగింపుపై సమీక్షతో పాటు లాక్ డౌన్ ఎత్తివేస్తే ఏ రకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనే విషయమై కూడ చర్చిస్తున్నారు.

బీహార్ ,ఒడిస్సా,గుజరాత్, హర్యానా, ఉత్తరాఖండ్ ,హిమాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి ముఖ్యమంత్రులు ఇవాళ ప్రధానితో మాట్లాడే అవకాశాలున్నాయి. ఈశాన్య రాష్ట్రాల నుండి మేఘాలయ మిజోరాం ముఖ్యమంత్రులు ప్రధానితో మాట్లాడనున్నారు.

 బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లాక్ డౌన్ ను ఎత్తివేసేందుకు సానుకూలంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. అంతేకాదు తమ రాష్ట్రానికి కూలీలు, విద్యార్థులు తిరిగి వచ్చేందుకు వీలుగా కేంద్రం కొత్త నోటిఫికేషన్  ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉందని చెబుతున్నారు.

also read:నెలరోజుల్లోపే కరోనా వాక్సిన్: భారతీయ సంస్థ వెల్లడి

 ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా  కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి. దీంతో వ్యాపారాలను తిరిగి ప్రారంభించేందుకు ఆ రాష్ట్రాలు సానుకూలంగా ఉన్నాయని సాచారం.అస్సాం, ఈశాన్యా రాష్ట్రాలు విడతల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేయాలని కోరుతున్నాయి.

అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేయడంతో పాటు రాష్ట్రంలో రవాణా విషయంలో కూడ ఆంక్షలు విధించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.ఏప్రిల్ 20 తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని రంగాలపై ఆంక్షలను సడలించింది. ఆంక్షలు సడలించిన రంగాలపై ప్రభావం ఎలా ఉంది, డాక్టర్ల రక్షణ చర్యలకు తీసుకొంటున్న చర్యలు, టెస్టింగ్ కిట్స్ గురించి చర్చించనున్నారు.