న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం డెవలప్ చేసిన వ్యాక్సిన్ రెండు మూడు వారాల్లో తయారు చేయడం ప్రారంభిస్తామని పుణెలోని  సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రకటించింది.

మనుషులపై ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతమైతే ఈ ఏడాది అక్టోబర్ మాసంలో మార్కెట్లోకి తీసుకురానున్నట్టుగా ఆ సంస్థ ఆదివారం నాడు ప్రకటించింది.ఈ కంపెనీ ఆక్స్ పర్డ్ యూనివర్శిటీతో ఒప్పందం కలిగి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఏడు టీకా తయారీ సంస్థలు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీతో ఒప్పందం చేసుకొన్నాయి.

యూకేలో క్లినికల్ ట్రయల్స్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసంలో విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉందని ఎస్ఐఐ సంస్థ భావిస్తోంది. దీంతో ఈ సంస్థ వ్యాక్సిన్ తయారీ కోసం రంగం సిద్దం చేసుకొంటుంది.

ఈ వ్యాక్సిన్ మనుషులపై ప్రయోగాలు ఈ నెల 23వ తేదీన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ప్రారంభమయ్యాయి. సుమారు 800 మంది ఎంపిక చేసిన వలంటీర్లపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగిస్తున్నారు.కరోనా వైరస్ ను నాశనం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ చేస్తున్న వ్యాక్సిన్ ఆరోవదిగా చెబుతున్నారు.

క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే ఈ ఏడాది సెప్టెంబర్ మాసానికి మిలియన్ వ్యాక్సిన్ డోస్ ను సిద్దం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ తర్వాత ఈ డోస్ తయారీని మరింత ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయనున్నారు.

also read:ఇండియాపై కరోనా దెబ్బ: 24 గంటల్లో 1,396 కేసులు, మొత్తం 27,896కి చేరిక

ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన ప్రోఫెసర్ డాక్టర్ హిల్ టీమ్ తో తాము కలిసి పనిచేస్తున్నట్టుగా ఎస్ఐఐ సీఈఓ అధర్ పుణావాల్లా చెప్పారు.రెండు, మూడు వారాల్లో టీకా ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు. మొదటి మూడు నెలలకు నెలకు ఐదు మిలియన్ డోస్ ఉత్పత్తి చేయనున్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత నెలకు 10 మిలియన్ల వ్యాక్సిన ఉత్పత్తి చేయాలిన ప్లాన్ చేశామని ఆయన తెలిపారు.

ఈ టీకా కోసం అవసరమైన రెగ్యులేటరీ ప్రమాణాలతో కూడ ఇండియాలో క్లినికట్ ట్రయల్స్ ను ప్రారంభించాలని భావిస్తున్నామని కంపెనీ తెలిపిందని ఓ వార్తా సంస్థ స్పష్టం చేసింది.

తాము డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తో  కూడ టచ్ లో ఉన్నామని పూణావాల్లా చెప్పారు.తాము అభివృద్ధి చేసే వ్యాక్సిన్ కు పేటేంట్ ను ఇవ్వబోమని కంపెనీ ఇదివరకే ప్రకటించింది.  ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ ను విక్రయించేందుకు అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది.