అహ్మదాబాద్: పటేల్ విగ్రహం దేశ చరిత్రలో నిలిచిపోతోందని  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  అభిప్రాయపడ్డారు. 

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో బుధవారం నాడు  ప్రధానమంత్రి  మోడీ పటేల్ విగ్రహన్ని ఆవిష్కరించిన తర్వాత నిర్వహించిన సభలో  ఆయన మాట్లాడారు. 

పటేల్‌కు నివాళిగా దేశ వ్యాప్తంగా రన్ ఫర్ యూనిటీ నిర్వహించారన్నారు. దేశ సమగ్రతకు కృషి చేసిన పటేల్ విగ్రహన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు  మోడీ చెప్పా,రు.

 

పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఈ రోజును ఏ భారతీయుడు కూడ మర్చిపోలేడని మోడీ అభిప్రాయపడ్డారు. ఇవాళ ఇండియా ఐక్యంగా  ఉందంటే  పటేల్ చొరవే కారణమని  మోడీ గుర్తు చేశారు. 

182 మీటర్ల ఎత్తున్న పటేల్ విగ్రహాన్ని జాతికి అంకితం చేస్తున్నట్టు  మోడీ చెప్పారు.

సంబంధిత వార్తలు

ప్రపంచంలోనే ఎత్తైన పటేల్ విగ్రహం, ఆవిష్కరించిన మోడీ