ఆదిలాబాద్‌లో మోడీ టూర్: రూ. 56 వేల కోట్లతో పలు పనులను ప్రారంభించిన ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ పర్యటించారు. వేలాది కోట్ల రూపాయాల పనులను ఆయన ప్రారంభించారు.

 PM Modi inaugurates, lay foundation stone of development projects worth more than Rs 56,000 crores lns


ఆదిలాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదిలాబాద్ లో రూ. 7 వేల కోట్ల విలువైన పలు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సోమవారంనాడు  ఆదిలాబాద్  జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ ఈ కార్యక్రమాలను ప్రారంభించారు.  రోడ్డు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రూ. 56 వేల కోట్ల పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, భూమి పూజల్లో ఆయన పాల్గొన్నారు.

రూ. 30,023 కోట్లతో ఎన్‌టీపీసీ కి చెందిన పలు ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభించారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలోని ఎన్‌టీపీసీ తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజ్ లోని రెండో యూనిట్ ను జాతికి అంకితం చేశారు. రూ. 8,007 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు.ఈ ప్రాజెక్టు అల్ట్రా-సూపర్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది.కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించనుంది.

ఈ ప్రాజెక్టును ప్రారంభించడం వల్ల తెలంగాణలో విద్యుత్ సరఫరా మరింత మెరుగు కానుంది. అంతేకాదు దేశవ్యాప్తంగా  24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఈ యూనిట్ దోహదపడనుంది.అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఆధారంగా ఈ ప్రాజెక్టు తెలంగాణకు 85 శాతం విద్యుత్ ను సరఫరా చేస్తుంది.దేశంలోని ఎన్‌టీపీసీ యొక్క అన్ని పవర్ స్టేషన్లలో  దాదాపు 42 శాతం అత్యధిక విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఈ యూనిట్ కలిగి ఉంటుంది.  
ఇతర ప్రాజెక్టులు

జార్ఖండ్ రాష్ట్రంలోని చత్రాలోని నార్త్ కరణ్ పురా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును కూడ మోడీ జాతికి అంకితం చేశారు. రూ. 4,609 కోట్ల పెట్టుబడితో  సాంప్రదాయ వాటర్ కూల్డ్ కండెన్సర్‌లతో పోలిస్తే నీటి తక్కువ నీటిని వినియోగిస్తూ  ఎయిర్ కూల్డ్ కండెన్సర్(ఏసీసీ)తో రూపొందించిన సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఇది.ఈ ప్రాజెక్టు పనులను మోడీ ప్రాంభించారు.

రూ. 17 వేల కోట్ల పెట్టుబడితో  ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోన్‌భద్రలో సింగ్రౌలీలో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజ్ 3 కి మోడీ శంకుస్థాపన చేశారు. పర్యావరణ, సుస్థిరత, సాంకేతిక ఆవిష్కరణల విషయంలో భారత్ పురోగతిని ఈ ప్రాజెక్టు హైలైట్ చేస్తుంది.

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ లోని సివత్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ లో రూ. 51 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఫ్లై యాష్ ఆధారిత లైట్ వెయిట్ అగ్రిగేట్ ప్లాంట్ ను మోడీ జాతికి అంకితం చేశారు. పెల్లెటైజింగ్ , సింటరింగ్ టెక్నాలజీని ఉపయోగించి   తయారు చేయనున్నారు.  

గ్రేటర్ నోయిడాలోని ఎన్‌టీపీసీ ఎన్‌ఈటీఆర్ఏ క్యాంపస్ లో రూ. 10 కోట్ల పెట్టుబడితో  ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను మోడీ జాతికి అంకితం చేశారు. ఎస్‌టీపీ నీటి నుండి ఉత్పత్తి చేసిన గ్రీన్ హైడ్రోజన్ విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో  సహాయపడుతుంది.

ఛత్తీస్ ఘడర్ లోని లారా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ లో ఉన్న  ఇథనాల్ ఫ్లాంట్ కు శంకుస్థాపన చేశారు. రూ. 294 కోట్ల పెట్టుబడితో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. వేస్ట్ ఫ్లూ గ్యాస్ నుండి కార్బన్ డై యాక్సైడ్ ను తీసుకుంటుంది. వాయు ఉద్గారాలను గ్రీన్ హౌస్ తగ్గించనుంది.

గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కు కూడ మోడీ శంకుస్థాపన చేశారు. రూ. 30 కోట్ల పెట్టుబడితో ఎన్‌టీపీసీ సిహాద్రిలో నెలకొల్పిన ఈ ప్రాజెక్టు సముద్రపు నీటి నుండి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని చేయనుంది.

ఛత్తీస్ ఘడ్ లోని కోర్బా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన యాష్ అధారిత అగ్రిగేట్ ప్లాంట్ కు మోడీ శంకుస్థాపన చేశారు. రూ. 22 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. 

పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రిడ్ ను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టులు కీలకపాత్ర పోషిస్తాయి.

రాజస్థాన్‌లోని జైసల్మేర్ లో నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పోరేషన్ (ఎన్‌హెచ్‌పిసీ) 380 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును కూడ మోడీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ప్రతి ఏటా 792 మిలియన్ యూనిట్ల గ్రీన్ పవర్ ను ఉత్పత్తి చేయనుంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని జలౌన్ లో బుందేల్ ఖండ్ లో సౌర్ ఉర్జా లిమిటెడ్ (బీఎస్‌యుఎల్) 1200 మెగావాట్ల జలౌన్ అల్ట్రా మెగా రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ పార్క్ కు మోడీ శంకుస్థాపన చేశారు. దీని ద్వారా ప్రతి ఏటా  2400 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని జలౌన్, కాన్పూర్ దేహత్ లో సత్లుజ్ జల్ విద్యుత్ నిగమ్ (ఎస్‌జేవీఎన్) కు చెందిన మూడు సౌర విద్యుత్ ప్రాజెక్టును మోడీ ప్రారంభించారు. మూడు ప్రాజెక్టుల సామర్థ్యం 200 మెగావాట్లు. ఉత్తరాఖండ్ లోని  ఉత్తరకాశీలోని నైత్వార్ మోరి హైడ్రో పవర్ స్టేషన్ తో పాటు అనుబంధ ట్రాన్స్ మిషన్ లైన్ ను కూడ మోడీ ప్రారంభించారు. బిలాస్ పూర్, హిమాచల్ ప్రదేశ్, దుబ్రి, అసోం, ఎస్‌జేవీఎన్ రెండు సోలార్ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన్ చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లలిత్ పూర్ జిల్లాలో టుస్కో కు చెందిన 600 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 1200 మిలియన్ యూనిట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి చేయనున్నారు.

రెన్యూవబుల్ ఎనర్జీ నుండి 2500 మెగావాట్ల విద్యుత్ కోసం  రెన్యూస్ కొప్పల్-నరేంద్ర ట్రాన్స్ మిషన్ స్కీమ్ ను మోడీ ప్రారంభించారు. ఇంటర్ స్టేట్ ట్రాన్స్ మిషన్ స్కీమ్ కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఉంది. దామోదర్ వ్యాలీ కార్పోరేషన్, ఇండిగ్రిడ్  ఇతర విద్యుత్ రంగానికి చెందిన ప్రాజెక్టులను కూడ  మోడీ ప్రారంభించారు.

విద్యుత్ రంగంతో పాటు రోడ్డు, రైలు ప్రాజెక్టులను కూడ మోడీ భూమి పూజల చేశారు. అంబారీ-ఆదిలాబాద్-పింపాల్ కుట్టి విద్యుద్దీకరించిన రైలు మార్గాన్ని మోడీ జాతికి అంకితం చేశారు. తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాన్ని కలిపే  )353 బీ జాతీయ రహదారి  163 జాతీయ రహదారులను ) పనులకు మోడీ శంకుస్థాపన చేశారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios