Indore: ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ను ప్రారంభించారు. ఇండోర్‌లోని బ్రిలియంట్ కనెక్షన్ సెంటర్‌లో రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ జరుగుతోంది.  

Global Investors Summit 2023: మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో జ‌రుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ను ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర మోడీ ప్రారంభించారు. ఇండోర్‌లోని బ్రిలియంట్ కనెక్షన్ సెంటర్‌లో రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ జరుగుతోంది. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. భార‌త్ సాధించిన ఆర్థిక పురోభివృద్ధిని గురించి వివ‌రించారు. భారతదేశం 'అమృత్ కాల్'లోకి ప్రవేశించిన తరుణంలో మధ్యప్రదేశ్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ‘అభివృద్ధి చెందిన భారతదేశాన్ని’ నిర్మించే మార్గంలో మనం ముందుకు సాగుతున్నామని ప్రధాని అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో మధ్యప్రదేశ్ పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పారు. అదే సమయంలో, అభివృద్ధి చెందిన భారతదేశం అర్థాన్ని వివరిస్తూ ప్రధానమంత్రి మాట్లాడారు. భార‌త దేశ అభివృద్ది అంటే అనేది దేశప్రజల కాంక్షను మాత్రమే కాకుండా వారి సంకల్పాన్ని కూడా సూచిస్తుందని తెలిపారు.

Scroll to load tweet…

సుస్థిర ప్రభుత్వం, నిర్ణయాత్మక ప్రభుత్వం-సరైన ఉద్దేశాలతో నడిచే ప్రభుత్వం అభివృద్ధికి అపూర్వమైన వేగాన్ని ఇస్తాయని ప్రధాని అన్నారు. దేశం కోసం ప్రతి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. గత ఎనిమిదేళ్లలో, తాము సంస్కరణల వేగం పెంచ‌డంతో పాటు ఆ స్థాయిని నిరంతరం పెంచామని అన్నారు. 8 ఏళ్లలో జాతీయ రహదారి నిర్మాణ వేగాన్ని రెట్టింపు చేశామ‌ని వివ‌రించారు. త‌మ పాల‌న కాలంలో భారతదేశంలో పనిచేసే విమానాశ్రయాల సంఖ్య రెండింతలు పెరిగిందని తెలిపారు. భారతదేశ పోర్ట్ హ్యాండ్లింగ్ కెపాసిటీ, పోర్ట్ టర్న్‌అరౌండ్‌లో అపూర్వమైన మెరుగుదల ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 

Scroll to load tweet…

దేశంలోని ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌స్తున్న టెక్నాల‌జీ గురించి కూడా ఆయ‌న మాట్లాడారు. 5G గురించి మాట్లాడిన ప్రధాని, భారతదేశం ప్రతి గ్రామానికి ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను అందిస్తోందని అన్నారు. "5G నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోంది. ప్రతి పరిశ్రమ మరియు వినియోగదారు కోసం 5G నుండి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నుండి AI వరకు ఏ కొత్త అవకాశాలు సృష్టించబడుతున్నా, అవి భారతదేశంలో అభివృద్ధి వేగాన్ని మరింత వేగవంతం చేస్తాయి" అని ప్ర‌ధాని అన్నారు.

Scroll to load tweet…