శ్రీరంగం రంగనాథ ఆలయంలో మోడీ పూజలు: కంభ రామాలయంలో పద్యాలు విన్న ప్రధాని

తమిళనాడులోని శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో ప్రధాని ఇవాళ కంభ రామాయణంలోని పద్యాలు విన్నారు.

PM Modi in Tamil Nadu, offers prayers at Srirangam temple lns

చెన్నై: తమిళనాడులోని శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో శనివారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంతో  శ్రీరాముడికి అనుబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి.

PM Modi in Tamil Nadu, offers prayers at Srirangam temple lns

శ్రీరంగంలోని పూజించబడే దైవం శ్రీరంగనాథస్వామి విష్ణు స్వరూపం. ఈ ఆలయ కథనం మేరకు  శ్రీరంగంలో ఉన్న విగ్రహన్ని శ్రీరాముడు, అతని పూర్వీకులు పూజించారని పురాణాలు చెబుతున్నాయి.ఈ విగ్రహన్ని బ్రహ్మ దేవుడు  శ్రీరాముడి పూర్వీకులకు ప్రసాదించినట్టుగా  స్థల పురాణం చెబుతుంది. 

అయోధ్యలో కూడ ఈ విగ్రహన్ని కలిగి ఉన్నారని చెబుతారు. రోజువారీ పూజలు చేశారు.  ఒకసారి విభీషణుడు శ్రీరాముడి నుండి విలువైన బహుమతిని కోరినప్పుడు  ఈ విగ్రహన్ని విభీషణుడికి ఇచ్చి ప్రతి రోజూ పూజించాలని సూచించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. విభీషణుడు లంకకు వెళ్తున్న సమయంలో ఈ విగ్రహం శ్రీరంగంలో ఉండిపోయింది.దీంతో  అప్పటి నుండి అక్కడే ఈ విగ్రహం ఉంది. శ్రీరాముడు పూజించిన ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

PM Modi in Tamil Nadu, offers prayers at Srirangam temple lns

రామాయణం జాతీయ ఇతిహాసం, దీంతో ఇది అన్ని భాషల్లో ఉంది. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలోని  కంబ రామాయణంలోని పద్యాలను  శ్రీరాముడు విన్నారు.12వ శతాబ్దంలో కంబ రామాయణాన్ని తమిళ కవి కంభన్ రచించాడు. కంబ రామాయణానికి  ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సందర్శించిన శ్రీరంగ ఆలయానికి  సంబంధాలున్నాయి.

PM Modi in Tamil Nadu, offers prayers at Srirangam temple lns

ఈ ఆలయంలోనే కంభన్ తాను రచించిన రామాయణాన్ని ప్రజలకు వినిపించారు. ఇందుకు గుర్తుగా ఈ ఆలయంలో మంటపం ఉంది.ఇక్కడే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూర్చుని  కంభ రామాయణంలోని పద్యాలు విన్నారు.

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios