దేశ  ప్రజల ఆశలు, ఆకాంక్షకు అనుగుణంగా  కొత్త  పార్లమెంట్ భవనం  పనిచేయనుందని  రాజ్యసఢ డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్  చెప్పారు.  


న్యూఢిల్లీ: దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు కొత్త పార్లమెంట్ భవనం ద్వారా నెరవేరుతాయని రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్ అన్నారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ వేడుకలు రెండు విడతలుగా సాగుతున్నాయి. తొలి విడతలో లోక్ స స్పీకర్ కార్యాలయంలో రాజదండం ప్రతిష్టాపనత ముగియనుంది. రెండో విడత మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. పార్లమెంట్ కొత్త భవనంలో ప్రధాని నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ , రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ లతో పాలు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ సింగ్ ప్రసంగించారు. దేశ ప్రజలంతా ఇవాళ గర్వపడాల్సిన రోజుగా ఆయన పేర్కొన్నారు. గత పార్లమెంట్ భవనం ప్రగతికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు.అంతేకాదు అనేక చారిత్రక ఘటనలకు సాక్షిగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు.

స్వాతంత్ర్య ప్రాప్తి, రాజ్యాంగ నిర్మాణం వంటి ఘటనకు గత పార్లమెంట్ భవనం సాక్షిగా నిలిచిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త భవనం ఆశ్వకత ఏర్పడిందని ఆయన చెప్పారు. 

ఆధునిక టెక్నాలజీతో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించినట్టుగా ఆయన వివరించారు. రానున్న రోజుల్లో సభ బాధ్యతలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.మరింత మెరుగైన సభా కార్యకలాపాల కోసం కొత్త పార్లమెంట్ భవనం నిర్మించినట్టుగా రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ తెలిపారు.

also read:కొత్త పార్లమెంట్ భవనం: ప్రారంభించిన మోడీ

రెండున్నర ఏళ్ల స్వల్ప వ్యవధిలోనే కొత్త పార్లమెంట్ భవనం నిర్మించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఈ భవనం ఉంటుందని హరివంశ్ సింగ్ చెప్పారు. నూతన భవనంలో దేశ ఉజ్వల భవిష్యత్తు నిర్ణయాలు జరుగుతాయన్నారు. రానున్న రోజుల్లో ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచానాకి భారత్ నేతృత్వం వహిస్తుందన్నారు.