రాజస్తాన్ సీఎం గెహ్లాట్ మాట్లాడుతుండగా ‘మోడీ.. మోడీ..’ నినాదాలు.. ప్రధాని ఏం చేశాడంటే?

ప్రధాని మోడీ ఈ రోజు రాజస్తాన్‌లో రూ. 5,500 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు. అనంతరం, సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇదే సమావేశానికి హాజరైన సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడారు. సీఎం గెహ్లాట్ మైక్ వద్దకు వెళ్లగానే ప్రజలు మోడీ.. మోడీ.. అంటూ నినాదాలు ఇచ్చారు. వారిని ప్రధాని మోడీ స్వయంగా వారించారు.
 

pm modi himself ask people to stop chanting modi, modi while rajasthan cm ashok gehlot speaking kms

జైపూర్: రాజస్తాన్‌లో ఈ రోజు ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోడీ కార్యక్రమంలో సీఎం అశోక్ గెహ్లాట్ కూడా పాల్గొన్నారు. సీఎం గెహ్లాట్ మాట్లాడుతుండగా ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. సీఎం గెహ్లాట్ మైక్ వద్దకు వెళ్లి మాట్లాడుతుండగా సభకు హాజరైన ప్రజలు మోడీ.. మోడీ.. అంటూ నినాదాలు ఇచ్చారు. అనూహ్యంగా ప్రధాని మోడీ మాత్రం వారిని వారించారు. సీఎం గెహ్లాట్ మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని, ఆ నినాదాలు  ఆపేయాలని ప్రజలకు చెప్పాల్సిందిగా సీపీ జోషిని కూడా ఆయన కోరారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ప్రత్యర్థులకు కూడా గౌరవం ఇస్తున్నారని ప్రధాని మోడీపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు రాజస్తాన్‌కు వెళ్లారు. ప్రధాని మోడీకి గవర్నర్ కలరాజ్ మిశ్రా, సీఎం అశోక్ గెహ్లాట్‌లు స్వాగతం పలికారు. రాజస్తాన్‌లోని నాత్‌ద్వారాలో ప్రయాణిస్తుండగా ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఆయన కారుపై పూల వర్షం కురిపించారు. 

ఈ రోజు రాజస్తాన్‌లో ఆయన రూ. 5,500 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు. రాజస్తాన్ ప్రజలకు ఆయన కంగ్రాట్స్ తెలిపారు. రాజస్తాన్‌లో మౌలిక వసతుల కల్పన చేయడానికి తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని వివరించారు. 

Also Read: అర్జెంటీనా ప్రభుత్వం నా తల నరికివేయాలని కోరుకుంది: పోప్ ఫ్రాన్సిస్

అనంతరం, ఆయన ప్రజలను ఉద్దేశించి సభలో మాట్లాడారు. అయితే, అదే సమావేశానికి హాజరైన సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడటానికి లేవగానే.. అంతా మోడీ.. మోడీ.. అంటూ నినాదాలు ఇచ్చారు. స్వయంగా ప్రధాని మోడీ వారిని వారించారు. ఆ నినాదాలను ఆపేయాలని, సీఎం గెహ్లాట్‌ను మాట్లాడనివ్వాలని కోరారు. అయినా.. ప్రజలు వినిపించుకోకపోవడంతో ఆయన సీపీ జోషికి సైగ చేశారు. ప్రజలను నినాదాలు ఆపాలని కోరాలని సూచించారు. వెంటనే సీపీ జోషి లేచి నిలబడి సభకు ఇరు వైపులకు వెళ్లి మోడీ.. మోడీ.. నినాదాలను ఆపేయాలనిప్రజలను కోరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios