Asianet News TeluguAsianet News Telugu

అర్జెంటీనా ప్రభుత్వం నా తల నరికివేయాలని కోరుకుంది: పోప్ ఫ్రాన్సిస్

పోప్ ఫ్రాన్సిస్ సంచలన కామెంట్స్ చేశారు. గతంలో అర్జెంటీనా ప్రభుత్వం తన తల నరికివేయాలని  కోరుకుందని అన్నారు.

pope francis says Argentina govt wanted to cut my head off ksm
Author
First Published May 10, 2023, 2:26 PM IST

పోప్ ఫ్రాన్సిస్ సంచలన కామెంట్స్ చేశారు. గతంలో అర్జెంటీనా ప్రభుత్వం తన తల నరికివేయాలని  కోరుకుందని అన్నారు. 1970ల సైనిక నియంతృత్వానికి సహకరించాడని తప్పుడు ఆరోపణలకు సంబంధించి ఒక దశాబ్దం క్రితం బ్యూనస్ ఎయిర్స్ ఆర్చిబిషప్‌గా ఉన్నప్పుడు అర్జెంటీనా ప్రభుత్వం తన తల నరికివేయాలని కోరుకుందని చెప్పారు. పోప్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ 29న హంగేరీని సందర్శించినప్పుడు జెస్యూట్‌లతో ఒక ప్రైవేట్ సంభాషణలో ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు ఇటాలియన్ జెస్యూట్ జర్నల్ సివిల్టా కాటోలికాలో మంగళవారం ప్రచురించబడ్డాయి

ఫ్రాన్సిస్ సందర్శన సమయంలో.. జెస్యూట్స్ మతపరమైన క్రమంలో ఒక హంగేరియన్ సభ్యుడు ఓ ప్రశ్న అడిగారు. హంగేరియన్-జన్మించిన జెస్యూట్ అయిన దివంగత ఫాదర్ ఫ్రెంక్ జాలిక్‌తో ఆయన సంబంధం గురించి అడిగారు. ఫ్రెంక్ జాలిక్‌ విషయానికి వస్తే.. బ్యూనస్ ఎయిర్స్ షాంటిటౌన్‌లో సామాజిక సేవ చేశారు. అయితే వామపక్షవాద గెరిల్లాలకు సహాయం చేశాడనే అనుమానంతో సైన్యం అరెస్టు చేసింది. 

1976లో ఉరుగ్వేకు చెందిన ఓర్లాండో యోరియో అనే మరో జెస్యూట్ తో కలిసి జాలిక్స్ అరెస్టయ్యారు. యోరియో 2000లో మరణించగా.. జాలిక్‌లు 2021లో మరణించారు. ఇక, 2013లో ఫ్రాన్సిస్ పోప్‌గా ఎన్నికైనప్పుడు, ఒక అర్జెంటీనా జర్నలిస్ట్.. ఫ్రాన్సిస్ ఫాదర్ జార్జ్ మారియో బెర్గోగ్లియో, అర్జెంటీనా జెస్యూట్‌లకు ఉన్నతాధికారిగా ఉన్నప్పుడు వామపక్షాలకు వ్యతిరేకంగా సైన్యం యొక్క "డర్టీ వార్" సమయంలో ఇద్దరు ప్రీస్ట్‌లకు ద్రోహం చేశారని ఆరోపించారు.

‘‘పరిస్థితి (నియంతృత్వ కాలంలో) నిజంగా చాలా గందరగోళంగా, అనిశ్చితంగా ఉంది. అప్పుడు నేను వారిని జైలులో పెట్టడానికి అప్పగించినట్లు కథలు అభివృద్ధి చెందాయి’’ అని ఫ్రాన్సిస్‌ చెప్పారు. ‘‘ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు నా తల నరికివేయాలని' కోరుకున్నారు ... (కానీ) చివరికి నా ఇన్నోసెన్స్ స్థాపించబడింది’’అని పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. 

అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఫ్రాన్సిస్ ఖండించారు. ఫ్రాన్సిస్ పోప్‌గా ఎన్నికైనప్పుడు.. జాలిక్‌ తన అరెస్టు కాబోయే పోప్ తప్పు కాదని ఒక ప్రకటన విడుదల చేశారు.2010లో పోప్ బ్యూనస్ ఎయిర్స్ యొక్క ఆర్చిబిషప్ అయ్యారు. ఆయన నియంతృత్వ కాలాన్ని పరిశోధించిన ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ ముందు సాక్ష్యం చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios