ప్రధాని నరేంద్ర మోడీ  తమిళనాడు రాష్ట్రంలోని  ముదుమలై  టైగర్ రిజర్వ్ లో ఏనుగులకు ఆహారం తినిపించారు

చెన్నై: తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్ లోని తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారంనాడు సందర్శించారు. ఏనుగులకు ప్రధాని మోడీ ఆహారం అందించారు. మావటిలతో ప్రధాని మోడీ ఈ సందర్భంగా మాట్లాడారు. 

also read:కర్ణాటక బండీపూర్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు: మోడీ టూర్

ఆస్కార్ అవార్డు పొందిన డాక్యుమెంటరీ ఎలిఫెంట్ విస్పరర్స్ లో నటించినబ బొమ్మన్ , బెల్లీ దంపతులను కూడా ప్రధాని మోడీ కలిశారు.మేనేజ్ మెంట్ ఎఫెక్టివ్ నెస్ ఎవాల్యూయేషన్ ఎక్సర్ సైజ్ లో అత్యధిక స్కోర్లు సాధించిన టైగర్ రిజర్వ్ ల ఫీల్డ్ డైరెక్టర్లతో మోడీ చర్చించారు. ఇవాళ ఉదయం కర్ణాటకలోని బండీపూర్ టైగర్ రిజర్వ్ లో పర్యటించారు. సుమారు 20 కి.మీ జీపులో పర్యటించారు.