బీజేపీకి ప్రధాని మోడీ రూ.2,000 విరాళం.. దేశ నిర్మాణానికి అందరూ భాగస్వాములవ్వాలని పిలుపు..

ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత పార్టీకి విరాళం ఇచ్చారు. నమో యాప్ ద్వారా బీజేపీకి రూ.2000 ను విరాళంగా అందజేశారు (PM Modi donates Rs 2,000 to BJP). విక్షిత్ భారత్ కోసం అందరూ బీజేపీకి విరాళం ఇవ్వాలని ప్రధాని పిలుపునిచ్చారు.

PM Modi donates Rs 2,000 to BJP He called upon all to participate in nation building..ISR

ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీకి రూ.2000 విరాళంగా ఇచ్చారు. నమో యాప్ ద్వారా శనివారం ఈ విరాళాన్ని అందజేశారు. విక్షిత్ భారత్ ను నిర్మించే ప్రయత్నాలను బలోపేతం చేయడానికి తాను దోహదపడ్డానని ఈ సందర్భంగా ప్రధాని ఉద్ఘాటించారు. నమో యాప్ ద్వారా 'డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్'లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. 

బీజేపీ సీటు ఇచ్చినా.. తిరస్కరించిన అభ్యర్థి.. సారీ నేను పోటీ చేయలేనంటూ పోస్ట్..

ఈ పేమెంట్ కు సంబంధించిన స్లిప్ ను షేర్ చేస్తూ.. ‘‘బీజేపీకి దోహదపడటం, విక్షిత్ భారత్ నిర్మాణం కోసం మన ప్రయత్నాలను బలోపేతం చేయడం సంతోషంగా ఉంది. నమో యాప్ ద్వారా ప్రతీ ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని నేను కోరుతున్నాను’’ అని ప్రధాని మోడీ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా.. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రాబోయే 10 రోజుల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. 10 రోజుల్లో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 29 కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందులో తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, బీహార్, జమ్ముకాశ్మీర్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాలు ఉన్నాయి. 

సోమవారం తెలంగాణలోని ఆదిలాబాద్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనంతరం తమిళనాడులోని కల్పాక్కంలోని భారతీయ నభికియా విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (భవిని)ను సందర్శిస్తారు. ఈ రెండు ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. మార్చి 5న తెలంగాణలోని సంగారెడ్డిలో పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.

కొమ్మపై ఆధారపడే పక్షిని కాదు.. రెక్కలతో స్వతహాగా ఎగురగలను - బీజేపీ ఎంపీ సంచనల వ్యాఖ్యలు

అనంతరం ఒడిశాకు వెళ్లిన అక్కడ చండిఖోల్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మార్చి 6న పశ్చిమబెంగాల్ కు వెళ్లి కోల్ కతాలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభింస్తారు. బరాసత్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.అనంతరం బిహార్ లో పర్యటించి బెటియాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అధికారులు తెలిపారు. ఈ నెల 7న జమ్ముకాశ్మీర్ లో పర్యటించనున్న ప్రధాని సాయంత్రం ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొంటారు. మార్చి 8న ఢిల్లీలో జరిగే తొలి జాతీయ అవార్డు కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం అసోం బయలుదేరి వెళ్తారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios