మహిళల అండర్-19 లో అదరగొట్టిన టీమిండియా .. ప్రధాని మోడీతో సహా పలువురి నేతల అభినందనలు..
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అండర్-19 మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి మహిళల క్రికెట్‌లో తొలి ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. భారత అండర్-19 మహిళా క్రికెట్ జట్టు సాధించిన ప్రత్యేక విజయంపై అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, రాజకీయ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత యువ మహిళలు అదరగొట్టారు. ఇంగ్లండ్‌పై యువ టీమిండియా జట్టు ఏడు వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 17 ఓవర్లలో కేవలం 68 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా ఇంగ్లాండ్ ను చిత్తుచిత్తుగా ఓడింది. కేవలం 14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి.. చరిత్ర సృష్టించింది. దీంతో అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధాని మోడీ అభినందనలు
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. షెఫాలీ వర్మ సారథ్యంలోని భారత మహిళా క్రికెట్ జట్టు ఆదివారం చరిత్ర సృష్టించింది. ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 7 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ప్రధాన మంత్రి మోడీ ట్విట్టర్ వేదిక ద్వారా అభినందలు తెలిపారు. “ప్రత్యేక విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. వారి అద్భుతమైన ఆట తీరు,వారి విజయం చాలా మంది వర్ధమాన క్రికెటర్లకు స్ఫూర్తినిస్తుంది. వారి భవిష్యత్ ప్రయత్నాలకు ప్రత్యేక శుభాకాంక్షలు. ” అని పేర్కొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత అండర్-19 మహిళా క్రికెట్ జట్టుకు అభినందించారు. వారి విజయం దేశం గర్వించేలా చేసిందని అన్నారు. రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేస్తూ.. "అండర్ 19 మహిళల T20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమ్ ఇండియాకు అభినందనలు! ఈ ప్రతిభావంతులైన అమ్మాయిల అద్భుతమైన ప్రదర్శన.. మన యువతకు, ముఖ్యంగా అమ్మాయిలకు స్ఫూర్తి. ఈ చారిత్రాత్మక విజయం భారతదేశానికి ప్రశంసలు తెచ్చిపెట్టింది. దేశం గర్వించేలా చేసింది" అని ట్వీట్ చేశారు.
చరిత్ర సృష్టించారు: అమిత్ షా
భారతదేశ కుమార్తెలు చరిత్ర సృష్టించారని... సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. భారతదేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది. మీ విజయం భారతదేశంలోని లక్షలాది మంది యువతుల కలలకు రెక్కలు ఇచ్చిందని పేర్కొన్నారు.
ఈ విజయంపై కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. మహిళా క్రికెట్ దూసుకుపోతోంది.యువ ఛాంపియన్‌కు అభినందనలు. ఇది మన వర్ధమాన ఆటగాళ్ల కెరీర్‌లో మరెన్నో విజయాలకు నాంది కావచ్చు. మహిళల క్రికెట్ స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. భారత జట్టు విజయం అద్భుతమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అభివర్ణించారు. ICC అండర్-19 మహిళల T20 ప్రపంచకప్‌లో అద్భుత విజయం సాధించిన యువ భారత అండర్-19 మహిళల జట్టుకు హృదయపూర్వక అభినందనలు.
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ గెలిచిన భారత జట్టుకు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జే షా రూ. 5 కోట్ల బహుమతి ప్రకటించారు. భారత్‌లో మహిళల క్రికెట్ పుంజుకుంటోందని, ప్రపంచకప్ విజయం మహిళల క్రికెట్ స్థాయిని అనేక మెట్లు పెంచిందని షా ట్వీట్ చేశారు. మొత్తం టీమ్‌కి, సపోర్టు స్టాఫ్‌కి రూ.5 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇది ఖచ్చితంగా గొప్ప సంవత్సరం. బుధవారం అహ్మదాబాద్‌కు రావాల్సిందిగా ఆయన బృందం మొత్తాన్ని ఆహ్వానించారు.
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. ఈ సులభమైన లక్ష్యాన్ని టీమిండియా 14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సాధించింది. దీంతో తొలి మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది.