స్టాలిన్, కనిమొళిలను ఓదార్చిన మోడీ.. కరుణకు నివాళి

PM Modi Arrival at chennai airport
Highlights

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధికి ప్రధాని నరేంద్రమోడీ నివాళుర్పించారు. కరుణ మరణవార్త విని దిగ్భ్రాంతికి గురైన ప్రధాని ఇవాళ వాయుసేన ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధికి ప్రధాని నరేంద్రమోడీ నివాళుర్పించారు. కరుణ మరణవార్త విని దిగ్భ్రాంతికి గురైన ప్రధాని ఇవాళ వాయుసేన ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా రాజాజీ హాల్‌కు చేరుకుని.. కరుణానిధికి శ్రద్ధాంజలి ఘటించారు.

తండ్రి మరణంతో కన్నీరుమున్నీరవుతున్న స్టాలిన్, కనిమొళిలను ఓదార్చి.. మిగిలిన కుటుంబసభ్యులను పరామర్శించారు. అంతకు ముందు  చెన్నై ఎయిర్‌పోర్టులో ప్రధాని మోడీకి తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్, ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తదితరులు ఘనస్వాగతం పలికారు.

loader