Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ భుజ్ లో మోడీ రోడ్ షో: ప్రధాని రాక కోసం ఎదురు చూసిన ప్రజలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు భుజ్ లో రోడ్ షో నిర్వహించారు.రోడ్డు పక్కన బారికేడ్లకు వెనుక వైపున నిల్చున్న ప్రజలకు అభివాదం చేశారు ప్రధాని. 

PM Mod holds roadshow in Bhuj
Author
First Published Aug 28, 2022, 11:09 AM IST

గాంధీనగర్:ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు గుజరాత్ రాష్ట్రంలోని భుజ్ లో రోడ్ షో నిర్వహించారు. ఇవాళ రెండో రోజున మోడీ తన పర్యటనను కొనసాగించారు.2001లో చోటు చేసుకున్న భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్ధం నిర్మించిన స్మృతి వన్ స్మారక కేంద్రాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు.

కచ్ జిల్లాలోని అంజర్ పట్టణ శివార్లలో నిర్మించిన స్మృతి వాన్ స్మారకాన్ని ఆయన ప్రారంభించారు.నిన్నటి నుండి మోడీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.  రెండు రోజుల పాటు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. దీంతో రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.కచ్ జిల్లాలోని భుజ్ పట్టణంలో సుమారు 10 ప్రాజెక్టులకు కూడా ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.కచ్ జిల్లాలోని సుమారు రూ. 4,400 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోడీ ప్రారంభిస్తారని అధికారులు చెప్పారు.ఈ ఏడాది చివర్లో గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

భుజ్ స్మారక కేంద్రం వివరాలు

2001లో చోటు చేసుకున్న భూకంపం కారణంగా సుమారు 13 వేల మంది మరణించారు. దంతో స్మృతి వాన్ మెమోరియల్ ను 470 ఎకరాల్లో నిర్మించారు. భూకంప సమయంలో మరణించిన వారి పేర్లను ఇక్కడ పొందుపర్చారు. ఇది అత్యాధునిక స్మృతి వాన్ భూకంప మ్యూజియంగా చెబుతున్నారు. 2001లో చోటు చేసుకున్న భూకంపం తర్వాత రాష్ట్రంలో ఏ రకంగా పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారో కూడా  ఈ స్మృతి కేంద్రంలో పొందుపర్చారు.

కచ్ జిల్లాలోని 948 గ్రామాలతో పాటు 10 పట్టణాలకు సాగు, తాగు నీరును అందించే సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కచ్ బ్రాంచ్ కెనాల్ ను మోడీ ఇవాళ ప్రారంభిస్తారు.భుజ్ లో ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం, సర్హాద్ డెయిరీకి చెందిన ఆటోమెటిక్ మిల్క్ ప్రాసెసింగ్ ప్యాకింట్ ప్లాంట్ ను కూడా ప్రారంభిస్తారు. గాంధీ ధామ్ లో డాక్టర్ అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ , అంజర్ లో వీల్ బాల్ స్మారక కేంద్రం, సఖత్రానాలో భుజ్ రెండో సబ్ స్టేషన్ ను  మోడీ ప్రారంభిస్తారు.

వీర్ బాలక్ స్మారక చిహ్నం 

2001 జనవరి 26న రిపబ్లిక్ డే  పరేడ్ నిర్వహిస్తున్న సమయంలోనే భూకంపం సంబవించింది. ఈ ఘటనలో 185 మంది విద్యార్ధులు, 20 మంది ఉపాధ్యాయులు మరణించారు. వీరికి నివాళులర్పిస్తూ అంజార్ పట్టణానికి సమీపంలో వీర్ బాలక్ స్మారక చిహ్నం కూడా ఈ ప్రాజెక్టులలో ఒకటి.

రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహిస్తున్న సమయంలో భూకంపం రావడంతో భవనాలు కూలి విద్యార్ధులపై శిథిలాలు పడ్డాయి. దీంతో శిథిలాల కిందే వారు మృత్యువాత పడ్డారు. స్మారక చిహ్నంలో ఐదు విభాగాలను ఏర్పాటు చేశారు. బాధితుల ఫోటోలు, పిల్లలు జివించిన సమయంలో ఉపయోగించిన వస్తువులను కూడా ఈ మ్యూజియంలో పొందుపర్చారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios