కరోనాతో ప్రతి ఒక్కరికీ రూ. 15 వేలు: అసలు వాస్తవం ఇదీ...
కరోనా విషయంలో ప్రజలకు ఉపయోగపడే సమాచారంతో పాటు ప్రజలను ఇబ్బందులకు గురిచేసే సమాచారం కూడ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ రూ. 15 వేలు ఇవ్వాలని మోడీ నిర్ణయం తీసుకొన్నారని ఓ మేసేజ్ చక్కర్లు కొడుతోంది.
ఈ లింకుపై క్లిక్ చేసి ధరఖాస్తును నింపాలని ఓ మేసేజ్ నెటిజన్లకు ఊరిస్తోంది. అయితే ఇది ఫేక్ మేసేజ్ అని ప్రెస్ ఇన్పర్మేషన్ బ్యూరో(పీఐబీ) తేల్చి చెప్పింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పీఐబీ ప్రకటించింది.
also read:కరోనా ఎఫెక్ట్: తుపాకీతో కాల్చుకొని ఆత్మాహత్యాయత్నం చేసిన కానిస్టేబుల్
ఈ రకమైన ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నివారణకు చర్యలు తీసుకొంటుంది.