భోపాల్: కరోనా వైరస్ నేపథ్యంలో పని ఒత్తిడిని తట్టుకోలేక  36 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ మంగళవారం నాడు మధ్యాహ్నం తన సర్వీస్ ఆయుధంతో కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. 

అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. అతడికి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు.భోపాల్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో కానిస్టేబుల్ ను చేర్పించారు. 36 ఏళ్ల చేతన్ సింగ్ అనే కానిస్టేబుల్ కి రెండు మాసాల క్రితం భోపాల్ పట్టణ శివార్లలోని రాతిబార్ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చారు. 

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన విధులను తనకు కేటాయించకూడదని ఆయన తన ఉన్నతాధికారులను కోరేవాడు. కరోనా విధుల్లో నియమిస్తే ఆయన అయిష్టంగా ఆ విధుల్లో పాల్గొనేవాడు.కరోనా విధులను నిర్వహిస్తే తనకు కూడ ఈ వైరస్ సోకే అవకాశం ఉందని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు.

మంగళవారం నాడు చేతన్ సింగ్ తన సర్వీస్ రివాల్వర్ తో తనను తాను కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో అతడిని ఇతర సిబ్బంది ఆసుపత్రిలో చేర్పించారు.
also read:కరోనా లాక్‌డౌన్: దేశంలో వలస కార్మికులకు 20 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు

రెండు మాసాల క్రితం వరకు ఆయన రిజర్వ్ లైన్స్ లో పనిచేసేవాడు. భోపాల్ పట్టణ శివార్లలోని రాతిబార్ పోలీస్ స్టేషన్లో విదులు నిర్వహించేందుకు ఆయన అయిష్టంగా ఉన్నట్టుగా ఉన్నతాధికారులు చెబుతున్నారు.

పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నట్టుగా భావించిన వారికి సైక్రియాటిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. రాష్ట్రంలో సుమారు 10 మంది పోలీస్ సిబ్బంది కరోనా బారినపడ్డారు.