ఇప్పటి వరకు ఆయన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా.. చాలా మందితో మాట్లాడారు. వారిలో రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా చాలా మంది పాల్గొన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ.. తరచూ ప్రజలతో మాట్లాడేందుకు.. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అనే విషయం మనకు తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా.. చాలా మందితో మాట్లాడారు. వారిలో రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా చాలా మంది పాల్గొన్నారు. కాగా.. ఈ నూతన సంవత్సరం 2022లో మోదీ తొలిసారిగా... మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాగా..దీనికి సంబంధించిన ఆయన స్పెషల్ గా ట్వీట్ చేశారు.

ఈ మన్ కీ బాత్ లో ప్రజలు, పౌరులు పాల్గొని.. తమ ఆలోచనలు, సూచనలు పంచుకోవాలని మోదీ స్పెషల్ గా కోరడం గమనార్హం. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

"ఈ నెల 30వ తేదీన, 2022లో మొదటి #MannKiBaat కార్యక్రమం జరుగుతుంది. స్ఫూర్తిదాయకమైన జీవిత కథలు, అంశాల ను మీరు నాతో పంచుకోవడానికి చాలా ఉన్నాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వాటిని @mygovindia లేదా NaMo యాప్‌లో షేర్ చేయండి. 1800-11-7800 డయల్ చేయడం ద్వారా మీ సందేశాన్ని రికార్డ్ చేయండి. " అంటూ మోదీ ట్వీట్ చేశారు.