New Delhi: 2019లో 'మోడీ ఇంటిపేరు'ను ప్రస్తావించిన కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని తొలగించారు. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. నిజాలు మాట్లాడినందుకు రాహుల్ గాంధీకి శిక్ష పడిందని పేర్కొన్నారు.
Congress President Mallikarjun Kharge: కుల రాజకీయాలు చేయడంతో పాటు వేల కోట్ల రూపాయల ప్రజా సొమ్ముతో దేశం విడిచి పారిపోయిన నీరవ్, లలిత్ మోడీలను సమర్థిస్తున్నారంటూ బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. 2019లో 'మోడీ ఇంటిపేరు'ను ప్రస్తావించిన కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని తొలగించారు. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. నిజాలు మాట్లాడినందుకు రాహుల్ గాంధీకి శిక్ష పడిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఓబీసీ వర్గాలను దొంగలతో పోల్చారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. పరారీలో ఉన్న నీరవ్ మోడీ, లలిత్ మోడీ వంటి వారిని అధికార పార్టీ (బీజేపీ) సమర్థిస్తోందని, కుల రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. 'మోడీ ఇంటిపేరు' వ్యాఖ్యలపై పరువునష్టం దావా కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలిన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధం మరింతగా ముదిరింది. ఈ నేపథ్యంలో, అబద్ధాలు, వ్యక్తిగత దూషణలు, ప్రతికూల రాజకీయాలు ఆయన రాజకీయాల్లో అంతర్భాగమని నడ్డా ఆరోపించారు. ఓబీసీ వర్గాలను దొంగలతో పోల్చడం ద్వారా రాహుల్ గాంధీ దయనీయమైన, కులతత్వ మనస్తత్వాన్ని ప్రదర్శించారన్నారు.
నడ్డా వ్యాఖ్యలకు మల్లిఖార్జున ఖర్గే కౌంటరిస్తూ విమర్శల దాడి చేశారు. జేపీసీ నుంచి మోడీ ప్రభుత్వం తప్పించుకోజాలదని వ్యాఖ్యానించారు. 'నీరవ్ మోడీ, లలిత్ మోడీ, మెహుల్ చోక్సీలు పలు బ్యాంకులు, ప్రజల సొమ్ముతో పారిపోయారు. ఓబీసీలు అలా చేయలేదని, అలాంటప్పుడు వారిని ఎలా అవమానించారని ప్రశ్నించారు. 'మీ బెస్ట్ ఫ్రెండ్' వల్ల ఎస్ బీఐ/ఎల్ఐసీ నష్టాల్లో కూరుకుపోయిందని' విమర్శించారు. అలాగే, ప్రజల సొమ్ముతో ఎవరు పారిపోయారనే ప్రశ్నకు తమ పార్టీ సమాధానాలు కోరుతోందనీ, అయితే బీజేపీ ప్రధాన సమస్య నుంచి పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వెనుకబడిన వర్గాలను కించపరిచేలా మాట్లాడుతున్నారన్నారు. 'వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, మైనారిటీల కోసం కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా నిలిచింది.. పోరాడింది. మనును నమ్ముకున్న వారు వెనుకబడిన తరగతుల గురించి మాట్లాడుతున్నారు' అని ఖర్గే అన్నారు.
