Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌లోకి ప్రశాంత్‌ కిశోర్‌.. చేరిక ముహుర్తం ఫిక్స్..!

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ప్రశాంత కిశోర్ కాంగ్రెస్ లో చేరతారని ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకలతో చర్చ లు జరిపారు. సోనియా గాంధీ కూడా వర్చువల్ పద్ధతిలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

PK Factor : Prashant Kishor to join the Congress, date fixed?
Author
Hyderabad, First Published Aug 6, 2021, 11:51 AM IST

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినబడుతోంది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ప్రధాన సలహాదారు పదవికి ప్రశాంత్ కిశోర్ గురువారం రాజీనామా చేశారు. తాత్కాలికంగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటన్నట్లు తెలిపారు. 

తన భవిష్యత్ కార్యాచరణమీద ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా పనిచేశారు. ఆ పార్టీ అప్పట్లో విజయం సాధంచింది. ఆ తరువాత జేడీయూలో చేరారు. అయితే,  2020లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనను జేడీయూ తొలగించింది. 

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ప్రశాంత కిశోర్ కాంగ్రెస్ లో చేరతారని ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకలతో చర్చ లు జరిపారు. సోనియా గాంధీ కూడా వర్చువల్ పద్ధతిలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాళ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఆ పార్టీ గెలిచింది. తర్వాత ఎన్నికల వ్యూహాలకు ఆయన దూరంగా ఉన్నారు. 

కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కి కొన్ని నెలలుగా ప్రధాన సలహాదారుగా ఉన్న‌ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్ గురువారం ఆ ప‌ద‌వికి రాజీనామా చేశారు. కొంత కాలంపాటు వ్య‌క్తిగ‌త జీవితంపైనే ఆయ‌న దృష్టి పెట్టాల‌నుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేపథ్యంలో పీకే ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. 

పంజాబ్: ఎన్నికల వేళ అమరీందర్ సింగ్‌కు షాక్, సలహాదారు పదవికి ప్రశాంత్ కిశోర్ రాజీనామా

అలాగే త‌న భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌పై కూడా తాను ఇంత‌వ‌ర‌కు నిర్ణ‌యం తీసుకోలేద‌ని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. త‌న‌ను ప్ర‌ధాన స‌ల‌హాదారు ప‌ద‌వి నుంచి రిలీవ్ చేయాల‌ని ఆయ‌న ప్రభుత్వాన్ని కోరారు. కాగా, ఈ ఏడాది మార్చిలో ప్ర‌శాంత్ కిశోర్‌ను త‌న ప్ర‌ధాన స‌ల‌హాదారుగా అమ‌రీందర్ సింగ్ నియ‌మించుకున్న సంగతి తెలిసిందే.

అయితే, ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తృణ‌మూల్ కాంగ్రెస్‌ను గెలిపించేందుకు మ‌మ‌తా బెన‌ర్జీ త‌ర‌ఫున వ్యూహ‌క‌ర్త‌గా ప్రశాంత్ కిశోర్‌ ప‌నిచేశారు. బీజేపీని మట్టికరిపించి ఆ రాష్ట్రంలో టీఎంసీ గెలిచింది. ఎన్నికల ఫలితాల అనంత‌రం తాను వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌త్యక్షంగా ప‌నిచేయ‌బోన‌ని, త‌న బృందం మాత్రం ప‌నిచేస్తుంద‌ని పీకే ప్రకటించి సంచలనం రేపారు. ఇటీవ‌ల దేశంలోని ప‌లు ప్ర‌తిప‌క్ష పార్టీల అధినేత‌ల‌తో చ‌ర్చించి ఆయ‌న వార్త‌ల్లో నిలిచారు. ఈ స‌మ‌యంలో అమ‌రీంద‌ర్ ప్ర‌ధాన స‌ల‌హాదారు ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేయ‌డం గ‌మ‌నార్హం

Follow Us:
Download App:
  • android
  • ios