Asianet News TeluguAsianet News Telugu

Valentines Day 2023: ఎఫైర్‌లు పెట్టుకునే కాలంలో కరెంట్ ఎఫైర్స్ చదువుతున్నా.. తేజస్వీకి పింకీ లవ్ లెటర్.. వైరల్

బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ను ఉద్దేశించి పింకీ అనే పాట్నాకు చెందిన యువతి ఓ లేఖ రాసింది. ఎఫైర్‌లు పెట్టుకునే కాలంలో కరెంట్ ఎఫైర్స్ చదువుతున్నా అని, తనకు ఉద్యోగం కావాలని కోరుతూ ‘లవ్ లెటర్’ రాసింది. ఈ లేఖ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నది.
 

pinky love letter to bihar deputy cm tejaswi yadav says in the age of having affairs iam reading current affairs
Author
First Published Feb 9, 2023, 3:01 PM IST

పాట్నా: సోషల్ మీడియాలో ఓ లవ్ లెటర్ ట్రెండ్ అవుతున్నది. ఆ లవ్ లెటర్‌ పాట్నాకు చెందిన ఓ యువతి బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ను ఉద్దేశించి రాసింది. పింకీ అనే యువతి ఈ లెటర్ రాసినట్టు అందులో ఉన్నది. ఆ లెటర్‌ను తేజస్వీ యాదవ్‌కు కాకుండా.. ఔరంగాబాద్‌కు చెందిన రైటర్ ప్రభాత్ బంధూలియాకు రాసి మెయిల్ పెట్టింది. బనారస్ వాలా ఇష్క్ పుస్తకం రాసిన ప్రభాత్ బంధూలియా ఆ లెటర్‌ను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి వేరేవారికి ఉద్దేశించి రాసిన లేఖను తనకు ఎందుకు మెయిల్ పెట్టినట్టు అని అడిగారు. పింకీ ఆయన ఫ్రెండ్ కాదు. ఇంతకీ ఆ లేఖలో ఏమున్నదో ఓ సారి చూద్దాం.

ఈ లెటర్ ఒక సార్కాస్టిక్ లెటర్ అని అర్థం అవుతూనే ఉన్నది. డియర్ బిహార్ డిప్యూటీ సీఎం అని లేఖ మొదలైంది. ‘నేను ఈ సమయంలో ఎంత నర్వస్‌గా ఉన్నానో మీకు తెలుసు. నేను నిరుద్యోగిని కాబట్టి, నీలాగా లవర్ మ్యారేజ్ చేసుకోలేకపోతున్నాను. నేను ప్రభావత్ బంధూలియాను నాలుగేళ్లుగా వన్ సైడెడ్‌గా ప్రేమిస్తున్నాను. ఎఫైర్లు నడిపించే కాలంలో నేను కరెంట్ ఎఫైర్స్ చదవుతున్నాను’ అని అందులో రాసి ఉన్నది.

‘ఒక వేళ నాకు జాబ్ వస్తే ఒక ప్రపోజల్ అతనికి పంపాలని అనుకుంటున్నాను. కానీ, ఉద్యోగాల ఓపెనింగ్స్ కనిపించడం లేదు. ఒక్కటి వచ్చినట్టు ఉన్నది. అది డాక్యుమెంట్ లీక్ అయింది. ఈ పరిస్థితులు చూస్తే ఈ వాలెంటైన్స్ డేకు నేను కనీసం ఒక్క ప్రశ్న కూడా ఆయన ముందు ఉంచేలా లేదు’ అని పింకీ పేర్కొంది.

Also Read: పర్వేజ్ ముషారఫ్ మరణం: కార్గిల్ యుద్ధం మాస్టర్ మైండ్, కశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రయత్నం.. ఆసక్తికర వాస్తవాలు

‘పెళ్లి కోసం బాబూజీ రెడీ అవుతూ బిజీగా ఉండగా నేనేమో కాంపిటీషన్ ప్రిపరేషన్స్‌లో ఉన్నాను. నేను పెళ్లి చేసుకునే సరికి నా మిత్రులంతా పిల్లలను కనేలా ఉన్నారు. వీటన్నింటినీ ఆలోచిస్తే నా మైండ్ అంతా నిరుత్సాహంతో నిండిపోతున్నది. ఎంతో ఆశతో నేను ఈ లేఖ రాస్తున్నాను. దయచేసి వీలైనంత తొందరగా నాకు ఉద్యోగం వచ్చేలా సహకరించండి. లేదంటే వేరే ఇంకెవరి తోనైనా వెళ్లిపోతాను. నాకు ఉద్యోగం లేకుంటే నేనేం చేసేదీ?’ అంటూ ఆ లేఖలో పింకీ రాసింది.

‘పింకీ (పాట్నా నుంచి) మీ ఓటర్, ప్రభాత్ బంధూలియా నుంచి తిరిగి ప్రేమ ను ఆశించిన ప్రేమికురాలిని’ అంటూ లేఖ ముగించింది.

Follow Us:
Download App:
  • android
  • ios