ఈ దీపావళికి గులాబీ మీనాకారీకి ఫుల్ డిమాండ్ ... ఈ హస్తకళా వస్తువుల ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఈ దీపావళికి ఉత్తర ప్రదేశ్ హస్తకళా ప్రొడక్ట్స్ గులాబీ మీనాకారీకి సూపర్ డిమాండ్ ఏర్పడింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండేకాదు విదేశాల నుంచి కూడా ఈ అందమైన వస్తువులకు ఆర్డర్లు వచ్చాయి.
వారణాసి : దేశంలో శతాబ్దాల నాటి హస్తకళా నైపుణ్యం గులాబీ మీనాకారీ ప్రొడక్ట్స్ కి దీపావళి పండగవేళ గోల్డ్, సిల్వర్ కంటే ఎక్కువ డిమాండ్ ఉంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు GI (Geographical Indications), ODOP (One district one product) ప్రొడక్ట్స్ ని గిఫ్ట్ గా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మీనాకారి ప్రొడక్ట్స్ కు భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. దీపావళి గిఫ్ట్ గా గులాబీ మీనాకారీ ప్రొడక్ట్స్ కి విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయి.
గులాబీ మీనాకారీ హస్తకళాకారులు విదేశాల నుంచి ఆర్డర్లు పొందారు. కాలిఫోర్నియా, ఫ్రాన్స్, దుబాయ్ వంటి దేశాల నుంచి GI ప్రొడక్ట్ లో భాగమైన గులాబీ మీనాకారీకి ఆర్డర్లు వచ్చాయి. దీపావళికి దాదాపు 4 నుంచి 5 కోట్ల వరకు ఆర్డర్లు వచ్చినట్లు కళాకారులు చెబుతున్నారు. ఒక్క దీపావళి పండగవేళలోనే కాదు ఈ గులాబీ మీనాకారీ హస్తకళాకారులకు ఏడాది పొడవునా కోట్ల విలువైన ఆర్డర్లు వస్తుంటాయి.
దీపావళికి రూ.4-5 కోట్ల విలువైన ఆర్డర్లు
హస్తకళాకారుల నైపుణ్యానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి వ్యవహరిస్తున్నారు... ఇలా GI ప్రొడక్ట్స్ కి అంతర్జాతీయ మార్కెట్ ను అందించారు. దీంతో గులాబీ మీనాకారీకి దేశీయ కార్పొరేట్ వర్గాల్లోనే కాదు విదేశాల్లోనూ డిమాండ్ ఏర్పడింది. నేషనల్ అవార్డు గ్రహీత కుంజ్ బిహారీ మాట్లాడుతూ... ఈ దీపావళికి వినాయకుడి విగ్రహాల కోసం ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. దీంతో పాటు నెమలి, ఏనుగు, శంఖం, ఆభరణాలు వంటి వాటికి కూడా డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు.
కేవలం దీపావళికి మాత్రమే దేశ, విదేశాల నుంచి గులాబీ మీనాకారీ కళాకారులకు దాదాపు రూ.4-5 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. దీంతో పాటు హస్తకళాకారులకు ఏడాది పొడవునా మంచి ఆర్డర్లు వస్తున్నాయి. గోల్డ్, సిల్వర్, డైమండ్ వర్క్ ఉండటం వల్ల గులాబీ మీనాకారీ ప్రొడక్ట్స్ ధర వేల నుంచి లక్షల వరకు ఉంటుంది.
కార్పొరేట్ కంపెనీలు గిఫ్ట్ గా ఇవ్వడానికి బల్క్ లో ఆర్డర్లు ఇస్తున్నామని హస్తకళాకారులు బాబు సోనీ, లోకేష్ సింగ్ తెలిపారు. దీపావళి సమయంలో మార్కెట్ లో గులాబీ మీనాకారీ ప్రొడక్ట్స్ కి డిమాండ్ పెరుగుతుంది... దీన్ని తీర్చడంలో మహిళలు, అమ్మాయిలది కీలక పాత్ర. చదువు, ఇంటి పనులతో పాటు మహిళలు ఈ హస్తకళా నైపుణ్యంతో ఆత్మనిర్భరత సాధిస్తున్నారని తెలిపారు.
హస్తకళాకారుడు విజయ్ కుమార్ ప్రభుత్వ సహాయంతో గులాబీ మీనాకారీ క్రాఫ్ట్ ను పెంపొందించడానికి, ఉపాధి కల్పించడానికి ఎప్పటికప్పుడు నిర్వహించే శిక్షణా కార్యక్రమాల్లో మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
కాలిఫోర్నియా నుండి ముందస్తు ఆర్డర్లు
కాలిఫోర్నియాలో నివసిస్తున్న NRI మధు గుప్తాకి సొంత స్టోర్ ఉంది. ప్రస్తుత ప్రభుత్వం భారత హస్తకళను మళ్ళీ విదేశాలకు చేర్చిందని ఆమె తెలిపారు. గులాబీ మీనాకారీ వంటి శతాబ్దాల నాటి హస్తకళకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. దీపావళి గిఫ్ట్ గా దీన్ని ఇష్టపడుతున్నారు. దీని డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని తన స్టోర్ కోసం ముందే ఆర్డర్ చేశానని ఆమె తెలిపారు.