భారతదేశంలోని 3500 మంది మహిళా పైలట్లు ఉండగా.. వారిలో 34 మంది ముస్లింలు. వారిలో హనా మొహ్సిన్ ఖాన్ ఒకరు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో అత్యధిక మహిళా పైలట్‌లు ఉన్నారు. అయినప్పటికీ ముస్లింల ప్రాతినిధ్యం 100 మందిలో ఒకరనే చెప్పాలి.
2020 నవంబర్ కోవిడ్-19 మహమ్మారి వల్ల మూతపడిన వాణిజ్య విమానాలు సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. ఓ రోజు సుమిత్రా దేవి (పేరు మార్చబడింది) అనే ప్రయాణికురాలు(ఆక్టోజెనేరియన్).గయా నుండి ఢిల్లీకి విమానంలో ప్రయాణిస్తుంది. ఉత్సుకతతో ఆమె విమానం పైలట్‌ను తనకు చూపించమని సిబ్బందిని అభ్యర్థించింది. A320 ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్ హోస్టెస్ బయటి నుండి కాక్‌పిట్ చూడటానికి ఆమెను తీసుకెళ్లింది. సిబ్బందిని చూసిన ఆమె .. విమానం నడుపుతోంది ఆడపిల్లనా..? అని ఆశ్చర్యపోయింది. ఆ అమ్మాయే హనా మొహ్సిన్ ఖాన్. భారతీయ మహిళ కమర్షియల్ పైలట్. ఆ అనుభవాన్ని తలచుకుంటే హానాకు ఈరోజు కూడా నవ్వు వస్తుంది. ఈ ఘటనపై హనా ట్విటర్‌లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారి ఆమెకు పేరు తెచ్చింది.
ప్రస్తుతం భారతదేశంలోని 3500 మంది మహిళా పైలట్లు ఉండగా.. వారిలో 34 మంది ముస్లింలు. వారిలో హనా మొహ్సిన్ ఖాన్ ఒకరు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో అత్యధిక మహిళా పైలట్‌లు ఉన్నారు. అయినప్పటికీ ముస్లింల ప్రాతినిధ్యం 100 మందిలో ఒకరనే చెప్పాలి.
ఉన్నత స్థానం, గుర్తింపు సాధించిన హనా మొహ్సిన్ ఖాన్ ప్రయాణం అంతా సులువుగా సాగలేదు. ఆమె తొలినాళ్లలో జర్నలిజం వైపు అడుగు లేసింది. మరో వైపు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని నడుపుతూ ఎన్నో అవమానాలను భరించి.. ప్రతి సవాళును అధిగమించి.. ఈ స్థానానికి చేరుకుంది. ముస్లిం మహిళ ఎదగడం అనేది ఆంక్షలతో కూడుకున్న విషయమే. ఈ సమస్యను హనా కూడా ఎదుర్కొంది.
ఆమె పాఠశాల విద్యను సౌదీ అరేబియాలో అభ్యసించింది. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరానికి తిరిగి వచ్చింది. సౌదీలో ఉన్నప్పుడు..స్త్రీ, పురుషులను సమానంగా చూడని సమాజంలో నివసించింది. కానీ, అలాంటి పరిస్థితులను వ్యతిరేకించేంది. అందుకే ఆమెను "ఫాస్ట్ గర్ల్" అని పిలిచేవారు. ఆమె గ్రాడ్యుయేషన్ కోసం ఢిల్లీకి మారిన తర్వాత పలు అవమాన ఘటనలు ఎదుర్కొంది. ఈ ఘటనలు తనని ప్రభావితం చేశాయని, ఆమె తన నిజమైన గమ్యం చేరుకోవడానికి చాలా సమయం పట్టేలా చేయని హనా అంటుంది.
మహిళ ఫైలట్ హనా మొహ్సిన్ ఖాన్ తో అవాజ్-ది వాయిస్ ఇంటర్య్వూ..
"10 సంవత్సరాల క్రింద నేను వేరే రంగంలో ప్రావీణ్యం సంపాదించినట్లు తెలిస్తే ఆశ్చర్యపోకండి." అంటూ తన జీవిత అనుభవాలను పంచుకుంది ఫైలట్ హనా . 2014లో త్రివేండ్రంలో జరిగిన వివాహానికి హాజరైన పైలట్‌ల బృందాన్ని కలుసుకున్న విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. వారు ఆమెను కూడా తేనేటీ విందుకు ఆహ్వానించారు. “వారు తమ స్థితిని చాటుకునే చోట Facebookకి చెక్-ఇన్ ఉండేది. ఆ గుంపులో తాను ఒక్క దానిని ఫైలట్ కాదనే విషయం గ్రహించాను.” హనా తన నిజమైన గమ్యాన్ని గ్రహించడానికి ఈ ఘటన కారణమైందని అంటారు. ఈ ఘటనతో ఆమె పైలట్ కావాలని నిర్ణయించుకుంది.
హనా మాట్లాడుతూ.. “నేను ఆఫ్-వెడ్డింగ్ సీజన్‌లో క్వాలిఫైయింగ్ పరీక్షలకు సిద్ధం కావడం ప్రారంభించాను. నేను రోజుకు 18 గంటలు చదువుకునేదానిని, నేను కనీసం 15 సంవత్సరాల తరువాత పరీక్షలకు సిద్దం కావడం అంత సులభం కాదు. హనా తన వ్రాత పరీక్షలను ఫ్లయింగ్ కలర్స్‌తో క్లియర్ చేసింది. ఆమె కమర్షియల్ ఫ్లయింగ్ లైసెన్స్ పొందే ముందు మూడు ఫ్లయింగ్ టెస్ట్‌లను క్లియర్ చేసిన తర్వాత చివరకు ఎంపికైంది. తర్వాత ఆమె విమాన శిక్షణ కోసం USAలోని ఫ్లోరిడాకు వెళ్లింది. ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో నైపుణ్యం కోసం గ్రీస్‌కు వెళ్లింది.
అయితే.. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడానికి చాలా టెన్షన్ పడింది. ఆ సమయం తనకు సినిమా సన్నివేశంలా తలపించిందని అంటారు. తన తల్లిదండ్రులను కూర్చోబెట్టి.. తన ఫైలెట్ ట్రైనింగ్ గురించి చెప్పిందట. అయితే.. ఆ విషయాన్ని వెల్లడించిన తర్వాత తన తల్లితండ్రులు ఎలా ఆందోళన చెందారో హనా గుర్తుచేసుకుంది. కానీ, వారు హనా నిర్ణయానికి ఎప్పుడూ నో చెప్పలేదట. ఆమె ఒక పెద్ద ఎయిర్‌లైన్‌లో ఉద్యోగం సంపాదించిన తర్వాత మాత్రమే ఆమె తల్లి ఇలా అరిచింది, "ఆమె తప్పు చేస్తుందని అందరూ అన్నారు. మన దేశంలో ఈ రంగంలో ఉద్యోగాలు లేవు. అనవసరంగా కెరీర్ నష్టం చేసుకుంటుందని అందరూ తనతో అంటున్నారు" అని బాధపడిందట.
హనా తల్లిదండ్రులు పిల్లల కోసం పెద్ద కలలు కన్నారు. ఆమె పసిబిడ్డగా ఉన్నప్పుడే కుటుంబం సౌదీ అరేబియాకు మారింది. " నేను ఏ రోజు కూడా స్త్రీలు పురుషుల కంటే తక్కువ అనే భావించలేదు. అలాంటి భావనను నా తండ్రి నాలో రాకుండా పెంచారు. ఆయన ఆడ, మగ మధ్య తేడా చూపించలేదు. దానికి నేను మా నాన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను." అని అన్నారు హనా.
తన నలుగురు తోబుట్టువులలో పెద్దదైనా హనా..ఓలీడర్ లా పెరిగింది. తన అభిప్రాయాలకు మద్దతు ఇచ్చే తల్లిదండ్రులు ఉండటంతో పాఠశాలలో ఆమె సమానత్వం కోసం పోరాడింది. “సౌదీ అరేబియాలో పెరిగిన నేను మహిళలు డ్రైవింగ్ చేయడం ఎప్పుడూ చూడలేదు. కొన్ని ఏండ్ల కిత్రం మహిళలపై పలు ఆంక్షాలుండేవి. చాలా పనుల్లో మహిళలను దూరం పెట్టేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. అందుకే నేను అన్నింటికంటే రెబల్‌గా మారాను. ” అని అన్నారు.
ఆమె 10వ తరగతి చదువుతున్న ఓ సంఘటనను పంచుకుంది. క్లాసులో యంత్రం గురించి ఉపాధ్యాయాన్ని బోధించడం ప్రారంభించాడు. కానీ చాలా మంది అమ్మాయిలు ఆసక్తి చూపలేదు. ఆ పాఠ్యాంశాన్ని సరదాగా తీసుకున్నారు. 13 ఏళ్ల హనా ఆ విషయం అభ్యంతరకరంగా భావించింది. ఇంజిన్ల గురించి నేర్పించమని ఆమె తన తండ్రిని కోరింది. అదే సమయంలో ఎన్సైక్లోపీడియా వీడియోలను చూసింది. తన తండ్రి కారు బానెట్‌ని తెరిచి..ఇంజన్ ఎలా ఉంటుంది. ఎలా పనిచేస్తుందనే విషయాలను వివరించారు. ఆ సమయంలో 55-డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న తన తండ్రి విసుగు చెందకుండా.. తన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పారంట. ఆ విషయాన్ని గుర్తు చేసుకుని తన నాన్నకు హేట్స్ ఆఫ్ చెప్పింది. మరుసటి రోజు ఆమె తాను తెలుసుకున్న విషయాలను ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులకు చెప్పి ఆశ్చర్యపరిచిందట.
హనా తన 10వ తరగతి పూర్తి కాగానే ఇండియా తిరిగి వచ్చారట. తన తర్వాత చదువు మీరట్ లో కొనసాగించారు. ఆమె 10వ తరగతిలో సైన్స్‌లో 99 శాతం, గణితంలో 100 మార్కులు సాధించింది. దీంతో ఆమె సైన్స్ స్ట్రీమ్‌ను కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ సమయంలో ఆమె తన హక్కుల కోసం గొంతు విప్పిడంతో పలుమార్లు బహిష్కరించబడింది. "దుస్తులు ధరించడం, స్కూటీ నడపడం, అబ్బాయిలతో స్నేహం చేయడం గురించి ప్రశ్నించాను." ఆ సమయంలో వీటిని తప్పుగా భావించేవారు. అయినా నువ్వు ముస్లిం అమ్మాయివి, ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు అని బెదిరించేవారట. అలాంటి వ్యాఖ్యలు ఆమెకు అసౌకర్యాన్ని కలిగించాయి.
త్వరలో ఆమె మాస్ కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్‌ను అభ్యసించడానికి ఢిల్లీకి వెళ్లింది. ఇక్కడ కూడా పలు ఆంక్షాలను ఎదుర్కొంది. అనేక అవమానాలను సహించింది. ఇవన్నీ ఆమె ఆశయానికి మరింత ఆజ్యం పోశాయి. ఆమె గ్రాడ్యుయేషన్ మొదటి సెమిస్టర్ నుండి ఇంటర్నింగ్ ప్రారంభించింది. ఉదయం కాలేజీకి వెళ్లడం. సాయంత్రం పని చేయడానికి వెళ్ళేంది. తన మొదటి ఉద్యోగం వినోద్ దువా (దివంగత జర్నలిస్ట్) వద్ద. అతను తన మొదటి బాస్, 17 సంవత్సరాల వయస్సులో తన మొదటి జీతం 5000 రూపాయలు.
ఆమె తన తల్లిదండ్రుల గురించి ఇలా చెబుతోంది."మా నాన్న ఒక గ్రామంలో పెరిగారు. చదువుకుని విదేశాలకు వెళ్లిన మొదటి తరంలో ఆయన ఒకరు. కుటుంబంతో సంబంధం లేకుండా వివాహం చేసుకున్నారు. అతను తన పిల్లలకు మంచిని కోరుకున్నాడు. కాబట్టి ఆయన మా కోసం చాలా కష్టపడ్డాడు. ఇక మా అమ్మ ..తాను నేను ఒకేలా కలలు కంటాం, ఆమెకు కూడావినూత్న ఆలోచనలు ఉన్నాయి. ఆమె ప్రతిదానిలో ఉత్తమంగా ఉండాలని కోరుకునేది. నా కుటుంబంలో ప్రతి ఒక్కరూ నా ఎదుగుదలకు ఆసరాగా నిలిచారు. నా నిర్ణయాల గురించి నేను పశ్చాత్తాపపడనప్పటికీ మీకు తెలుసా.. కానీ నా నిజమైన గమ్యాన్ని , లక్ష్యాన్ని చేరడానికి నాకు చాలా సమయం పట్టింది."అన్నారు.
హనా తన మొదటి వాణిజ్య విమానాన్ని2020లో నడిపింది. తన తొలి రోజు అనుభవం గురించి మాట్లాడుతూ.. "నేను మంచి ల్యాండింగ్ కోసం ఆ అల్లాను ప్రార్థిస్తున్నాను. అలాగే.. నాకు అవకాశాన్ని ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా..ఇంకా అది నా జ్ఞాపకశక్తిలో తాజాగా అనిపిస్తుంది. ఒకే ఒక్క తేడా ఏమిటంటే.. ఈ రోజు నేను బిగ్గరగా నవ్వగలను.అదే సమయంలో సంతోషంగా, విచారంగా, కోపంగా ఉండగలను." అని వివరించారు.ఈ అసమానతల సమాజంలో మహిళలు ఒకరికొకరు సహాయం చేసుకోవాలని ఆమె భావిస్తోంది.
హనా ఇలా చెప్పింది. "చిన్న స్కర్ట్ ధరించినందుకు లేదా తల నుండి కాలి వరకు కప్పుకున్నందుకు నన్ను అంచనా వేయకూడదు. ఈ ఎంపికలలో దేనినైనా నాపై బలవంతం చేయలేరు.నేను హిజాబ్ ధరించకపోవడం వల్ల నేను ముస్లిం కాకుండా పోను. ఇప్పటికే మహిళలు కష్టాలను చూస్తున్నాను. లింగ వివక్ష ఎంత ప్రబలంగా ఉందో వివరించింది. హనా ఒకసారి జామా మసీదులో తన అభ్యంగన స్నానం చేస్తుండగా.. ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి.. ఆమె మోచేతి కొనపై నీరు తగలకపోవడంతో ఆమె తప్పు చేస్తుందని నిందించారట. మీ ఊహా తప్పు అని చెప్పారట.
ఒక రోజు CISF మహిళా అధికారి హనాను మెచ్చుకున్నారు. "మేడమ్ యూనిఫాం మీకు చాలా బాగా సరిపోంది." హనా బదులిస్తూ.. “మీరు కూడా పర్ఫెక్ట్‌గా కనిపిస్తున్నారు. మహిళలందరికీ యూనిఫాం సరిపోతుంది. తమ ఇష్టాలను సమాజం కూడా గౌరవించాలి. మహిళలను తమ కలలకు అనుగుణంగా నడుచుకోనివ్వాలని సమాధానమిచ్చారట.
జనాలకు చేరువ కావడంలో సోషల్ మీడియా ప్రాముఖ్యత గురించి ఆమె చెబుతూ.. “ఢిల్లీ అల్లర్ల సమయంలోనే ట్విట్టర్‌లో రాణా ఆప (రాణా సఫ్వీ), తారీక్, యుమన్ ఆప, సఫా,ఇతరులతో పాటు నేను విట్టర్‌లో ఒక సీరియస్ స్పేస్ అని గ్రహించాను. ముస్తఫాబాద్‌లోని 44 కుటుంబాలకు నిధులు సేకరించి పునరావాసం కల్పించగలిగాము. మేము వారికి రేషన్, మూడు నెలల అద్దె ఇచ్చాము. ఔత్సాహిక విమాన ప్రయాణికులకు సహాయం చేయడానికి హనా తన సోషల్ మీడియాను ఉపయోగిస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లోని తన కథనాలలో, ఆమె ఫ్లయింగ్,ఏవియేషన్ కెరీర్ గురించి కొన్ని వేలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఫైలింగ్ కాకుండా ఆమె విపరీతమైన పాఠకురాలు, ఆహార ప్రియురాలు, పెంపుడు తల్లి, పార్ట్ టైమ్ రచయిత కూడా. “వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య, మీరు నిజంగా ఏదైనా చేయాలనుకుంటే.. మిమ్ములను మీరు నమ్మండి. ఉన్నత స్థానాలను ఆధిరోహిస్తారు." అని యువతకు సందేశమిచ్చారు.
