ప్యూన్ ఉద్యోగం కోసం: అర్హత 5వ తరగతి... పీహెచ్‌డీ అభ్యర్థుల దరఖాస్తు

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 30, Aug 2018, 6:17 PM IST
PhD holders apply for peon job in UP
Highlights

దేశంలో నిరుద్యోగం రోజు రోజుకి పెరిగిపోతోంది. చిన్న ఉద్యోగానికి సైతం ఉన్నత విద్యావంతులు పోటీపడుతుండటం గమనార్హం. తాజాగా నిరుద్యోగం పెరిగిపోతుందనడానికి మరో ఉదాహరణ

దేశంలో నిరుద్యోగం రోజు రోజుకి పెరిగిపోతోంది. చిన్న ఉద్యోగానికి సైతం ఉన్నత విద్యావంతులు పోటీపడుతుండటం గమనార్హం. తాజాగా నిరుద్యోగం పెరిగిపోతుందనడానికి మరో ఉదాహరణ. ఓ చిన్న ప్యూన్ ఉద్యోగానికి ఏకంగా పీహెచ్‌డీ అభ్యర్థులు పోటీపడుతున్నారు.

ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో మెసేంజర్‌గా విధులు నిర్వహించడానికి 62 పోస్టుల భర్తీకి ఆ రాష్ట్ర పోలీస్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగం కోసం ఏకంగా 93000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 50 వేలమంది గ్రాడ్యుయేట్లు, 28000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 3,700 మంది పీహెచ్‌డీ పట్టాదారులు ఉన్నారు.

పోస్ట్ మ్యాన్ తరహాలో ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్‌కు ఉత్తరప్రత్యుత్తరాలు అందించే ఈ ప్యూన్ పోస్టుకు ఐదో తరగతితో పాటు ద్విచక్ర వాహనం నడిపే మెళకువలు తెలిస్తే  చాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే దరఖాస్తులు భారీగా రావడంతో రాతపరీక్షను నిర్వహించాలని పోలీస్ శాఖ భావిస్తోంది.

కొద్దిరోజుల క్రితం రైల్వేశాఖ లక్ష ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేస్తే సుమారు రెండు కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. ముంబై పోలీస్ శాఖలో 1100 పోస్ట్‌ల భర్తీకి దరఖాస్తులు కోరగా.. 2 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 

loader